ప్రపంచంలో సురక్షితమైన నగరాలు ఇవే!

తక్కువ నేరాలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, భద్రత, విదేశీయులతో స్నేహపూర్వకంగా ఉండటం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ‘ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్’ సంస్థ ప్రపంచంలో 60 నగరాలకు ర్యాంకులను ప్రకటించింది. డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగన్‌ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది.image:pixabay

టొరంటో


కెనడాలోని టొరంటో నగరం రెండో ప్లేస్‌ దక్కించుకుంది.

image:pixabay

సింగపూర్‌ 


విస్తీర్ణ పరంగా చిన్నదే అయిన విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాల్లో దూసుకుపోతోంది. సురక్షితమైన నగరాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.

image:pixabay

సిడ్నీ


ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌ వేల్స్‌ రాష్ట్ర రాజధాని సిడ్నీ. ఏటా ఇక్కడ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుతారు. భద్రత విషయంలో ఈ నగరం నాలుగో స్థానంలో ఉంది.

image:pixabay

టోక్యో


జపాన్‌ రాజధాని టోక్యోలో దొంగతనాలు చాలా తక్కువ. ఈ నగరవాసులు నడకకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. భద్రత విషయంలో ఐదో స్థానంలో నిలిచింది. image:pixabay

ఆమ్‌స్టర్‌డామ్‌


నెదర్లాండ్స్‌ రాజధాని అయిన ఆమ్‌స్టర్‌డామ్‌ నగరం సురక్షితమైన నగరాల జాబితాలో ఆరో స్థానంలో ఉంది. 

image:pixabay

వెల్లింగ్టన్


న్యూజిలాండ్‌ రాజధాని వెల్లింగ్టన్‌ 7వ స్థానంలో నిలిచింది.

image:pixabay

మెల్‌బోర్న్‌ 


ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాలలో ఒకటైన మెల్‌బోర్న్ ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. image:pixabay 

హాంకాంగ్


చైనా అధీనంలో ఉన్న హాంకాంగ్ నగరం తొమ్మిదో స్థానంలో ఉంది.

image:pixabay

స్టాక్‌ హోమ్‌


స్వీడన్‌ రాజధాని స్టాక్‌ హోమ్‌ పదో స్థానం దక్కించుకుంది.

image:pixabay

బాల్కనీ లుక్‌.. ఈ మొక్కలతో అదుర్స్‌

వైద్యరంగంలో స్థిరపడాలంటే డాక్టరే అవ్వాలా?

విదేశాల్లో చదవాలంటే.. ఈ పరీక్షలు రాయాల్సిందే!

Eenadu.net Home