ఇలాంటి పాస్‌వర్డ్స్‌ పెట్టుకోకండి!

కంప్యూటర్‌, మొబైల్‌, ఇ-మెయిల్‌, యాప్స్‌, బ్యాంకింగ్‌ ఇలా వేటికైనా వ్యక్తిగత భద్రత కోసం పాస్‌వర్డ్స్‌ పెట్టుకుంటాం. అయితే, చాలా మంది ఇతరులు సులభంగా కనిపెట్టగలిగే పాస్‌వర్డ్స్‌నే పెట్టుకుంటున్నారట.

Image: RKC

భారత్‌లో అత్యధిక మంది పెట్టుకున్న కామన్‌ పాస్‌వర్డ్‌ జాబితాను పాస్‌వర్డ్‌ మేనేజింగ్‌ సంస్థ.. నార్డ్‌పాస్‌ విడుదల చేసింది. వాటిలో టాప్‌ 20 కామన్‌ పాస్‌వర్డ్‌ ఏంటో చూద్దాం..

Image: Facebook/Nordpass

Image: Eenadu

Image: Eenadu

పాస్‌వర్డ్‌ క్రాకింగ్‌ సాఫ్ట్‌వేర్స్‌ ఇలాంటి అక్షరాలు, అంకెలను ఆల్గరిథమ్‌ ద్వారా తొందరగా కనిపెట్టగలవు. హ్యాకర్లు వీటిని ఉపయోగించి సులభంగా మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్‌ ఖాతాల్లో నగదు చోరీ చేసే అవకాశముంది. 

Image: Pixabay

పాస్‌వర్డ్‌ ఎలా ఉండాలి?

పాస్‌వర్డ్‌ను అప్పర్‌కేస్‌.. లోయర్‌కేస్‌ అక్షరాలు, అంకెలు, సింబల్స్‌ కాంబినేషన్‌తో కనీసం 8 క్యారెక్టర్స్‌ తగ్గకుండా పెట్టుకోవాలి. ఎన్ని ఎక్కువ క్యారెక్టర్స్‌ ఉంటే పాస్‌వర్డ్‌ అంత సురక్షితమని చెప్పొచ్చు.

Image: RKC

అన్ని కాంబినేషన్స్‌తో 10 క్యారెక్టర్ల పాస్‌వర్డ్‌ పెడితే.. దాన్ని క్రాక్‌ చేయడానికి 5 నెలల సమయం పడుతుందట. అదే, 18 క్యారెక్టర్లు పెడితే.. 438 ట్రిలియన్‌ సంవత్సరాలు పడుతుందట. 

Image: RKC

హ్యాక్‌కి గురి కావొద్దంటే..

అన్నింటికీ ఒకే పాస్‌వర్డ్‌ పెట్టుకోవద్దు. అలాగే.. మీ పేర్లు, కుటుంబసభ్యుల పేర్లు, పుట్టిన తేదీలు, సంవత్సరాలు, మొబైల్‌ నంబర్లు వంటివి పాస్‌వర్డ్‌లో ఉండకూడదు. తరచూ పాస్‌వర్డ్స్‌ను మారుస్తుండాలి.

Image: RKC

ఎయిర్‌టెల్‌ ఓటీటీ ప్లాన్లు ఇవే..

హ్యాకర్స్‌లో.. వైట్‌, బ్లాక్‌, గ్రే... తెలుసా?

IRCTCలో ఈ విషయాలు తెలుసా?

Eenadu.net Home