#eenadu

క్రెడిట్‌ కార్డులూ కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. సాధారణ కార్డుల కంటే భిన్నంగానే కాదు.. అనేక ప్రయోజనాలు అందిస్తున్నాయి. 

అంతేకాదు వీటి జాయినింగ్‌ ఫీజు, రెన్యువల్‌ ఫీజు కూడా భారీగానే ఉంటుంది. మరి ప్రస్తుతం ఉన్న టాప్‌ మెటల్‌ కార్డులేంటో చూసేద్దామా...

హెచ్‌డీఎఫ్‌సీ ఇన్ఫినియా మెటల్‌ క్రెడిట్‌ కార్డ్‌

ప్రతి రూ.150 చెల్లింపుపై 5 రివార్డు పాయింట్లు

జాయినింగ్‌/రెన్యువల్‌ ఫీజు: 12,500+ జీఎస్టీ

కార్డ్‌ యాక్టివేషన్‌ తర్వాత వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద 12,500 రివార్డు పాయింట్లు

హెచ్‌డీఎఫ్‌సీ బిజ్‌ బ్లాక్‌ మెటల్‌

ఒక్క స్టేట్‌మెంట్‌ సైకిల్‌లో రూ.50వేలు ఖర్చుపెడితే 5X రివార్డు పాయింట్లు

యాక్టివ్‌ కార్డ్‌ హోల్డర్లకు అన్‌లిమిటెడ్‌ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌

జాయినింగ్‌/రెన్యువల్‌ ఫీజు: 10,000+ జీఎస్టీ

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ ప్రైవేట్‌ క్రెడిట్‌ కార్డ్‌

ఆన్‌లైన్‌ కొనుగోళ్లపై 6X, సాధారణ కొనుగోళ్లపై 3X రివార్డు పాయింట్లు

భారత్‌తోపాటు విదేశాల్లో అన్‌లిమిటెడ్‌ లాంజ్‌ యాక్సెస్‌ ఉచితం

జాయినింగ్‌/ రెన్యువల్‌ ఫీజు: 50,000+ జీఎస్టీ

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌

130కు పైగా దేశాల్లో లాంజ్‌ యాక్సెస్‌తో పాటు ఉచిత వైఫై తో పాటు ఇతర సేవలు

విదేశాల్లో చేసే ప్రతి ఖర్చుపై 3X మెంబర్‌షిప్‌ రివార్డు పాయింట్లు 

జాయినింగ్‌ ఫీజు: 60,000+ జీఎస్టీ

ఐసీఐసీఐ ఎమరాల్డ్ ప్రైవేట్‌ మెటల్‌ క్రెడిట్‌ కార్డ్‌

జాయినింగ్‌ బోనస్‌ కింద 12,500 రివార్డు పాయింట్లు

ఏడాది పాటు తాజ్‌ ఎపిక్యూర్‌ మెంబర్‌షిప్‌, ఈజీ డైనర్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌

జాయినింగ్‌ ఫీజు: 12,499

యాక్సిస్‌ బ్యాంక్‌ బుర్గుండి ప్రైవేట్‌ క్రెడిట్‌ కార్డ్‌

ఈజీ డైనర్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌, ఏడాదికి 50 కాంప్లిమెంటరీ గోల్ఫ్‌ రౌండ్లు

రూ.400 నుంచి రూ.4000 మధ్య ఇంధన కొనుగోళ్లపై 1 శాతం సర్‌ఛార్జీ మినహాయిపు

జాయినింగ్‌ ఫీజు: 50,000+ జీఎస్టీ

ఎస్‌బీఐ Aurum క్రెడిట్‌ కార్డ్‌

ఏడాదికి 16 కాంప్లిమెంటరీ గోల్ఫ్‌ రౌండ్లు, వెల్‌కమ్‌ ఆఫర్‌కింద రూ.10,000 వరకు ప్రయోజనాలు 

ప్రతి త్రైమాసికానికి నాలుగు కాంప్లిమెంటరీ లాంజ్‌ యాక్సెస్‌లు

జాయినింగ్‌/ రెన్యువల్‌ ఫీజు: రూ.9999+ జీఎస్టీ

అతిపెద్ద ఐపీఓలు ఇవే.. ఏది ఎప్పుడు?

పండగ బోనస్‌ వచ్చిందా? ఏం చేస్తారు?

హ్యుందాయ్‌ ఐపీఓ.. లాట్‌, ధరల శ్రేణి వివరాలివే!

Eenadu.net Home