విమాన టికెట్లు తక్కువ ధరకే

పొందాలంటే..?

విమాన టికెట్‌ ధరలు ప్రయాణ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ పెరుగుతుంటాయి. కాబట్టి మీరు ప్రయాణించే తేదీకి కనీసం 2 నుంచి 3 నెలల ముందు టికెట్‌ బుక్‌ చేసుకుంటే తక్కువ ధరకే లభిస్తుంది.

image:pixabay

వారాంతాలు, పండగల సమయంలో విమాన టికెట్ ధరలు సాధారణంగానే ఎక్కువ ఉంటాయి. కాబట్టి.. వారం మధ్యలో లేదా ప్రయాణికుల రద్దీ తక్కువ ఉండే తేదీల్లో టికెట్‌ బుక్‌ చేసుకోవడం ఉత్తమం.

image:pixabay

విమాన టికెట్‌ ధరలను ఒకే వెబ్‌సైట్‌లో కాకుండా వివిధ వెబ్‌సైట్లలో చెక్‌ చేయాలి. ధరలు ఒక్కో చోట ఒక్కోలా చూపిస్తుంటాయి. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుగోలు చేయొచ్చు.

image:pixabay

విమాన టికెట్ల ధరల గురించి వెబ్‌సైట్లలో వెతికినప్పుడు మీ సెర్చింగ్‌ హిస్టరీని ఆయా వెబ్‌సైట్లు సేకరిస్తాయి. ఆ తర్వాత మీ అవసరాన్ని ఆసరా చేసుకొని ఎక్కువ ధర చూపిస్తుంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు కూకీస్‌ డిలీట్‌ చేయండి. లేదా ఇన్‌కాగ్నిటో మోడ్‌లో టికెట్స్‌పై ఆరా తీయండి.

image:pixabay

విమాన ప్రయాణికులు పెరుగుతున్న నేపథ్యంలో లోకల్‌, బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. కాకపోతే వాటిల్లో లగ్జరీ సౌకర్యాలేమీ ఉండవు. తక్కువ ధరలో ప్రయాణించాలంటే ఈ ఎయిర్‌లైన్స్‌ మంచి ఎంపిక.

image:pixabay

విమాన టికెట్‌ బుకింగ్‌ వెబ్‌సైట్స్‌ ధర తగ్గినప్పుడు కస్టమర్లకు ఆ విషయాన్ని తెలియజేస్తుంటాయి. ఆయా వెబ్‌సైట్‌ల నోటిఫికేషన్స్‌ను ఆన్‌ చేసుకొని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

image:pixabay 


తరచూ ఒకే విమాన సంస్థలో ప్రయాణించే ప్రయాణికులకు ఆయా సంస్థలు ఫ్లైట్‌ పాయింట్స్‌ ఇస్తుంటాయి. వాటిని తర్వాత టికెట్‌ బుకింగ్‌ సమయంలో రిడీమ్‌ చేసుకోవచ్చు.

image:pixabay


ఎయిర్‌లైన్‌ సంస్థలు అప్పుడప్పుడు డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అలాంటి సమయంలో టికెట్స్‌ తక్కువ ధరకే లభిస్తాయి.

image:pixabay


కుటుంబం, స్నేహితులతో బృందంగా వెళ్లాల్సి ఉన్నా.. ఒక్క టికెట్‌ ధర గురించే ఆరా తీయాలి. ఒక్కటి కంటే ఎక్కువ టికెట్ల గురించి ఆరా తీస్తే ధర ఎక్కువగా ఉంటుంది.

image:pixabay

మార్కెట్లో మదుపు చేస్తున్నారా? ఇవి తెలుసా..

విజేతలు చెప్పిన సూత్రాలు మీకోసం..

ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ఐపీఓ.. కీ పాయింట్స్‌

Eenadu.net Home