గుండెపోటు.. ఇలా చేస్తే జరగదు చేటు!

ఒకప్పుడు వృద్ధుల్లోనే ఎక్కువగా వచ్చే గుండెపోటు.. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరినీ కలవరపెడుతోంది. అందుకే, గుండెను కాపాడుకోవాల్సిన అవసరముంది. మరి అందుకు ఏం చేయాలంటే...

Image: RKC

రక్తపోటు

రక్తపోటు పెరిగినప్పుడు రక్త ప్రసరణలో వేగం పెరుగుతుంది. ఈ క్రమంలో రక్త నాళాల్లో పూడికలు ఉంటే రక్త ప్రసరణ నిలిచిపోయి గుండెపోటు వచ్చే అవకాశాలుంటాయి. అందుకే, బీపీని నియంత్రణలో ఉంచుకోవాలి. 

Image: RKC

బరువు నియంత్రణ

అధిక బరువు ఉన్నవారిలో గుండెపోటు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మిత ఆహారంతో బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. 

Image: RKC

కొవ్వు

శరీరంలో మంచి కొవ్వును నియంత్రణలో ఉంచుకుంటూనే చెడు కొవ్వును తగ్గించుకోవాలి. లేదంటే.. ఇవి శరీరంలో పేరుకుపోయి.. రక్తప్రసరణకు అడ్డంకిగా మారతాయి. దీంతో గుండెపోటు వచ్చే అవకాశముంది. జంక్‌ఫుడ్‌, ఫ్రైడ్‌ ఫుడ్స్‌ తగ్గించుకుంటే మంచిది. 

Image: RKC

మధుమేహం

మధుమేహం ఉన్నవారు ఏ జబ్బుకైనా త్వరగా గురవుతాయి. వాటిలో గుండెపోటూ ఒకటి. మధుమేహం ఎక్కువగా ఉన్నప్పుడు ఔషధాలు, వంటింటి చిట్కాలతో నియంత్రణలో ఉంచుకోవడం మంచిది. 

Image: RKC

ధూమపానం

పొగతాగడం వల్ల సంభవించే ప్రతి 5 మరణాల్లో ఒకటి గుండెపోటుతోనేనని ఓ అధ్యయనంలో తేలింది. అంటే.. పొగ ఊపిరితిత్తులకే కాదు.. గుండెకూ చేటు చేస్తుంది. కాబట్టి, వీలైనంత వరకు సిగరెట్లకు దూరంగా ఉండాలి. 

Image: RKC

మద్యపానం

మద్యపానం వల్ల కూడా గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయి. అందుకే, మద్యపానాన్ని కూడా నియంత్రణలో ఉంచుకోవాలి. అతిగా మద్యం సేవించకూడదు.

Image: RKC

వ్యాయామం

శరీరం ఫిట్‌గా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. అందుకు రోజూ కనీసం గంట అయినా వ్యాయామం చేయాలి. దీంతో జీవ క్రియలు సక్రమంగా జరుగుతాయి. ఎలాంటి సమస్యలు రావు.

Image: RKC

రక్తహీనతకు అనేక కారణాలు అంటున్నారు వైద్యులు..

ఆరోగ్యాన్ని, ఆయుష్షును అందించే ఆహారం!

లివర్‌ కొవ్వుకి ఈ ఆహరపదార్థాలే కారణం!

Eenadu.net Home