త్రిప్తి వస్తే.. కుర్రకారుకు ఉక్కపోతే!

‘యానిమల్‌’తో బ్లాక్‌ బస్టర్ హిట్, ఫేమ్‌ అందుకుంది త్రిప్తి దిమ్రి. ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంటోంది. 

ఆనంద్‌ తివారీ దర్శకత్వంలో వచ్చిన విక్కీ కౌశల్‌ ‘బ్యాడ్‌ న్యూజ్‌’తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

This browser does not support the video element.

‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’, ‘భూల్ భులయ్యా 3’, ‘ధడక్‌ 2’ తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ఈ ఏడాది బాలీవుడ్‌ హంగామా స్టైల్‌ ఐకాన్స్‌లో ‘మోస్ట్ స్టైలిష్‌ గ్రౌండ్‌ బ్రేకింగ్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ టైటిల్‌ గెలుచుకుంది.

‘యానిమల్’ తర్వాత తన పేరు కన్నా అందులో తన పాత్ర పేరైన ‘జోయా’గానే త్రిప్తిని గుర్తిస్తున్నారు.

రణ్‌బీర్‌ - సందీప్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఆ సినిమాలో గ్లామర్‌ ఒలకబోతతో కుర్రకారుకు ఉక్కపోత పుట్టించింది. 

‘యానిమల్‌’కు ముందు త్రిప్తి ఫాలోవర్స్‌ వేలకే పరిమితమైతే ఆ తర్వాత లక్షలు దాటిపోయారు.

ఇన్‌స్టాలో 53లక్షల మంది ఫాలో అవుతున్నారు. తరచూ ఫొటో షూట్లతో నెట్టింట అభిమానుల్ని అలరిస్తూ ఉంటుంది.

This browser does not support the video element.

ట్రిప్‌లకి వెళ్లడం అంటే త్రిప్తికి ఇష్టం. బీచ్‌లో ఆడుకోవడం, ప్రకృతిని ఆస్వాదించడం ఆమె హాబీలు.

ఇళయరాజా మ్యూజిక్‌.. కప్పు కాఫీ.. అదో మ్యాజిక్‌

వయసు తగ్గింది.. స్క్రీన్‌ మెరిసింది..

‘ది గోట్‌’లో అతిథులు.. మెరుపులు!

Eenadu.net Home