బాలీవుడ్ క్రేజీయెస్ట్‌ హీరోయిన్‌!

‘యానిమల్‌’లో ‘ఎవరెవరో..’ అంటూ క్రేజ్‌ సంపాదించుకుంది త్రిప్తి డిమ్రి. తాజాగా ‘భూల్‌ భూలయ్యా 3’తో మరో విజయాన్ని అందుకుంది.

నవంబర్‌ 1న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ తెచ్చుకుంది. ఈ మూవీలో త్రిప్తి మీరా పాత్రలో ఆకట్టుకుంటోంది. 

ఈ ఏడాది ‘బ్యాడ్‌ న్యూజ్‌’, ‘విక్కీ విద్యా కా వోహ్ వాలా వీడియో’తో అలరించింది. ‘ధడక్‌ 2’ నవంబర్‌ 22న విడుదల కానుంది. 

‘యానిమల్‌’తో హిట్‌ కొట్టిన తర్వాత త్రిప్తి అప్పట్నుంచీ తన హవా కొనసాగిస్తూ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారిపోయింది.

‘2024 బాలీవుడ్‌ హంగామా స్టైల్‌ ఐకాన్స్‌’లో ‘మోస్ట్‌ స్టైలిష్‌ గ్రౌండ్‌ బ్రేకింగ్‌ స్టార్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ టైటిల్ గెలుచుకుంది.

ఒకప్పుడు ఈమె ఇన్‌స్టా ఫాలోవర్లు రెండు లక్షలు. ప్రస్తుతం ఆ సంఖ్య 59 లక్షలకు చేరింది.

ట్రెడిషనల్‌ వేర్‌ అంటే ఇష్టం. తరచూ లెహంగాలు, చీరల్లో సందడి చేస్తూ ఉంటుంది. మోడ్రన్‌ దుస్తులతోనూ ట్రెండ్ సృష్టిస్తుంటుంది.

ట్రిప్‌లంటే ఇష్టపడే త్రిప్తి తరచూ విదేశాలకు వెళ్తుంది. అందులోనూ ఇటలీ బాగా నచ్చుతుంది అని అంటోంది.

‘కష్టపడకుండా వచ్చింది ఏదైనా శాశ్వతంగా ఉండదు. కష్టపడి సాధించుకున్నది ఏదీ అంత తేలికగా పోదు’ అనే మాటను నమ్ముతానని చెబుతోంది.

ఫిట్‌గా ఉండేందుకు స్విమ్మింగ్‌ చేస్తుంది. దీని వల్ల ఒత్తిడీ తగ్గుతుంది. యోగా చేయడం వల్ల అందం, ఆరోగ్యం అని చెబుతోంది. 

ప్రకృతి బాగా ఇష్టం. పచ్చదనం, నీళ్లు, కొండలు ఆకర్షిస్తాయి’ అని ఇష్టాలు చెప్పింది.

సినిమాలు ఎక్కువగా చూస్తుంది. ఖాళీ సమయం దొరికితే పాప్‌కార్న్‌ డబ్బా పట్టుకొని మూవీని ఎంజాయ్‌ చేస్తుంది.  

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home