అందాల ‘కుందవై’ త్రిష

త్రిష.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని నటి. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ భామ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’తో అలరించడానికి సిద్ధమైంది.

Image:Instagram

మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో కుందవై అనే యువరాణి పాత్రలో త్రిష నటించింది. ఈ సినిమా తొలి భాగం సెప్టెంబరు 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Image:Instagram 

చోళ సామ్రాజ్య వైభవాన్ని, అప్పటి రాజకీయ తంత్రాలను ఈ సినిమాలో చూపిస్తున్నారు. ఇందులోని కొన్ని సన్నివేశాల్లో త్రిష నిజమైన నగలే ధరించిందట.

Image:Instagram

త్రిష.. మే 4, 1983న తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. చెన్నైలోనే పుట్టి పెరిగింది.

Image:Instagram

చెన్నైలోని సాక్రెడ్‌ హార్ట్‌ మెట్రిక్యూలేషన్‌ స్కూల్‌లో చదువుకుంది. అదే నగరంలోని ఎతిరాజ్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌లో బ్యాచిలర్‌ ఆఫ్ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (BBA) అభ్యసించింది.

Image:Instagram

మోడలింగ్‌ సమయంలో త్రిష అందాల పోటీల్లో పాల్గొంది. ‘మిస్‌ సేలం’, ‘మిస్‌ మద్రాస్‌’, మిస్‌ ఇండియా-2001 పీజియంట్స్‌ ‘బ్యూటిఫుల్‌ స్మైల్‌’ టైటిల్స్‌ గెలుచుకుంది.

Image:Instagram

 ప్రశాంత్‌ ‘జోడి’లో సిమ్రన్‌ స్నేహితురాలిగా చిన్న పాత్రలో నటించింది త్రిష. అప్పుడు ఆమె వయసు 16 ఏళ్లే.

Image:Instagram

కెరీర్‌ తొలినాళ్లలో వివిధ ప్రకటనల్లో నటించింది త్రిష. 19 ఏళ్ల వయసులోనే ఓ ప్రకటన కోసం చిన్నారికి తల్లిగానూ కనిపించింది. Image:Instagram

కోలీవుడ్‌లో నటిగా ప్రస్థానం మొదలుపెట్టిన త్రిష... . కోలీవుడ్‌, తెలుగులో అగ్ర హీరోలతో నటించి, టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా మారింది. హిందీలో ‘కట్టా మీటా’లోనూ నటించింది.

Image:Instagram

తెలుగులో మూడుసార్లు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకుంది. ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా!’, ‘ఆడవారి మాటలకు.. అర్థాలే వేరులే’లో నటనకుగాను ఈ అవార్డులు దక్కాయి.

Image:Instagram

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా!’కి ఉత్తమ నటిగా నంది అవార్డునూ గెల్చుకుంది. ప్రస్తుతం మలయాళంలో ‘రామ్‌’, తెలుగు వెబ్‌సిరీస్‌ ‘బృందా’, ‘ది రోడ్‌’ అనే మరో చిత్రంలో త్రిష నటిస్తూ బిజీగా ఉంది.

Image:Instagram

ఆయనే నా డ్యాన్స్‌ టీచర్‌

మేనమామే అయినా 17 సార్లు ఆడిషన్‌ ఇచ్చింది!

యూట్యూబ్‌ నుంచి కేన్స్‌ దాకా..

Eenadu.net Home