సెకండ్‌ ఇన్నింగ్స్‌... ఫుల్‌ స్పీడ్‌లో త్రిష

ఈ మధ్య కాస్త జోరు తగ్గించిన త్రిష ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. త్వరలో ‘ద రోడ్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.  

‘ద రోడ్‌’ అక్టోబరు 6న విడుదల కానుంది. ఈ చిత్రంతో ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుందని డైరక్టర్‌ అరుణ్‌ వాసిగరణ్‌ త్రిషపై ప్రశంసల వర్షం కురిపించారు. 

చిరంజీవి 156వ సినిమాలో త్రిషను ఎంపిక చేశారని సమాచారం. ‘స్టాలిన్‌’ తర్వాత ఇప్పుడు... అంటే 17 ఏళ్లకు ఇద్దరూ కలసి నటిస్తున్నారు. 

This browser does not support the video element.

త్రిష, అజిత్‌ కాంబినేషన్‌లో ‘విడమూయర్చి’ త్వరలో రానుంది. ఇటీవలే ఈ సినిమాను అనౌన్స్‌ చేశారు

విజయ్‌ ‘లియో’లోనూ త్రిష నటించింది. అక్టోబరు 19న సినిమా విడుదల కానుంది. త్రిష సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఈ సినిమాతోనే మొదలైంది అని చెప్పొచ్చు.

‘సతురంగ వెట్టై 2’, ‘ఐడెంటిటీ’, ‘రామ్‌ పార్ట్‌ 1’, ‘గర్జనై’ చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగులోనూ కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.  

కిందటి ఏడాది డిసెంబరులో ‘రాంగీ’లో జర్నలిస్టు అవతారమెత్తింది త్రిష. ఈ లేడీ ఓరియెంటెడ్‌ సినిమా ఫలితం నిరాశ పరిచింది. 

This browser does not support the video element.

త్రిష యాక్టింగ్‌లోకి వచ్చి 24 ఏళ్లయినా.. అందం, ఉత్సాహంలో ఏ మాత్రం తగ్గలేదు. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో ఆమెను చూస్తే ఎవరైనా ఇదే మాట అంటారు. 

‘‘మేమిద్దరం దాదాపు దశాబ్దం నుంచి స్నేహితులం’’ అంటూ రానా ఇటీవల త్రిష గురించి చెప్పాడు. దీంతో అప్పటి విషయాలు, ఫొటోలు మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

త్రిష సోషల్‌ మీడియాలో పోస్టులు తక్కువే పెట్టినా ఫాలోయింగ్‌ ఎక్కువే. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 6.2 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.

(photos: instagram)

ఈ వారం.. సందడి వీరిదే..

చదివింది ‘లా’.. నటనతో ఆకట్టుకునేలా!

పుట్టింది కేరళ.. చదివింది హైదరాబాద్‌..!

Eenadu.net Home