ఈ ఏఐ టూల్స్‌ ట్రై చేశారా?

చాట్‌జీపీటీ

మీకు అంతర్జాలంలో ఏ సమాచారం కావాలన్నా చాట్‌జీపీటీ క్షణాల్లో దానిని అందిస్తుంది. మీకు కావాల్సిన టాపిక్‌ చెబితే కంటెంట్‌ను సృష్టిస్తుంది. దాన్ని వివిధ భాషల్లోకి అనువదిస్తుంది.

బ్రెయిన్‌.ఎఫ్‌ఎం

ఏకాగ్రతతో పనిచేస్తున్నా.. విశ్రాంతి తీసుకుంటున్నా.. నిద్రిస్తున్నా.. దానికి అనుగుణంగా శ్రావ్యమైన సంగీతాన్ని వినిపిస్తుంది. 

డాల్‌-ఇ

మీకు ఎలాంటి ఇమేజ్‌ కావాలో.. టెక్ట్స్‌ రూపంలో తెలియజేస్తే కృత్రిమ మేధ ద్వారా ఆ ఇమేజ్‌ను సృష్టిస్తుంది. 

గ్రామర్లీ

లెటర్స్‌ రాయడంలో సాయం చేస్తుంది. మీరు రాసే కంటెంట్‌లో తప్పులను సరిచేస్తుంది. వాక్య నిర్మాణంలో సరైన పదాల్ని సూచిస్తుంది. 

ఇంటీరియర్‌ ఏఐ

మనకు నచ్చినట్టుగా ఇంటీరియర్‌ డిజైన్‌ నమూనాలను రూపొందించుకోవచ్చు. వాటిని ఇమేజ్‌ రూపంలోకి మార్చుకొని డిజైనర్స్‌కు చూపించవచ్చు.

మిస్సీవ్‌

ఇ-మెయిల్స్‌ను సులభంగా రూపొందించొచ్చు. కావాల్సిన అంశంపై మెయిల్‌ రాయమని మిస్సీవ్‌కు కమాండ్‌ ఇస్తే.. క్షణాల్లో మెయిల్‌ సిద్ధమైపోతుంది. 

మోషన్‌

మీ రోజువారీ పనులను వివరిస్తే.. వాటి ప్రాధాన్యతను బట్టి.. షెడ్యూల్‌ను రూపొందిస్తుంది. అవసరమైన ప్రాజెక్ట్‌ ప్లాన్స్‌ను సృష్టిస్తుంది.

మర్ఫ్‌ ఏఐ

టెక్ట్స్‌ రూపంలో ఉన్న కంటెంట్‌ను ఆడియోగా మార్చుతుంది. వీడియోలు, పాడ్‌కాస్ట్‌లు, ప్రజెంటేషన్‌లకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. 

ఒట్టర్‌.ఏఐ

ఆడియో లేదా వీడియోలోని సంభాషల్ని రాయడం అంత సులువైన పని కాదు. కానీ, ఈ టూల్‌ దాన్ని సులభతరం చేస్తుంది. వీడియో లేదా ఆడియోను ఇందులో అప్‌లోడ్‌ చేస్తే స్క్రిప్ట్‌ను అందిస్తుంది. 

టోమ్‌

స్కూల్‌, ఆఫీసులో ఏదైనా ప్రజెంటేషన్‌ ఇవ్వాలనుకుంటే.. ఆ పనిని టోమ్‌ చేసేస్తుంది. మీకు కావాల్సిన టాపిక్‌కు సంబంధించిన కంటెంట్‌ను ఇన్‌పుట్‌గా ఇస్తే.. దానికి అనుగుణంగా ఇమేజ్‌ స్లైడర్స్‌ రూపొందిస్తుంది.

₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఏఐ!

ఫేక్‌ కాల్స్‌కు ‘చక్షు’తో చెక్‌

Eenadu.net Home