సిబిల్‌ నివేదికలో తప్పులుంటే..

రుణం తీసుకోవాలంటే.. బ్యాంకులు ముందుగా పరిశీలించేది సిబిల్‌ నివేదికనే. ఇందులో ఎలాంటి తప్పులూ దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

 ఒకవేళ నివేదికలో పొరపాట్లు ఉన్నట్లు గుర్తిస్తే వాటిని వెంటనే క్రెడిట్‌ బ్యూరోల దృష్టికి తీసుకెళ్లాలి. 

 నివేదికలో కొన్నిసార్లు మన పేరు, చిరునామా, పుట్టిన రోజు, పాన్‌ వివరాలు తప్పుగా వస్తుంటాయి.

ఇప్పటికే ఉన్న రుణాలకు సంబంధించిన సమాచారం నివేదికలో కనిపిస్తుంది. ఈ రుణాల సంఖ్య లేదా మొత్తం అధికంగా ఉన్నప్పుడు ఎక్కడో పొరపాటు దొర్లిందని అర్థం.

రుణ వాయిదాలు సమయానికే చెల్లిస్తున్నా కొన్నిసార్లు ఆలస్యమైనట్లు పేర్కొనవచ్చు.

మీ రుణ ఖాతా వివరాలను పోల్చి చూడండి. ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే బ్యాంకును సంప్రదించి, వాటిని సరిచేయాల్సిందిగా కోరండి.

నివేదికలో ఉన్న వివరాలు అర్థం కాకపోతే మీ బ్యాంకు శాఖను సంప్రదించి, వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి.

సిబిల్‌ నివేదికలో ప్రతి ఖాతాదారుడికీ ఒక ప్రత్యేక సంఖ్య ఉంటుంది. పొరపాట్లను నమోదు చేసేటప్పుడు దీన్ని పేర్కొనాల్సి ఉంటుంది.

తప్పులు గుర్తిస్తే వెంటనే క్రెడిట్‌ బ్యూరోకు ఫిర్యాదు చేయాలి. అది ఫిర్యాదు వివరాలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు పంపి ధ్రువీకరించుకుంటుంది.

పొరపాట్లను సరిచేసేందుకు 30-45 రోజుల వరకూ సమయం పడుతుంది.

రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేకున్నా.. కనీసం ఏడాదికోసారైనా మీ క్రెడిట్‌ నివేదికను తనిఖీ చేసుకోవడం మర్చిపోవద్దు. అప్పుడే ఎలాంటి తప్పులకూ తావుండదు.

ఎఫ్‌ అండ్‌ ఓ కొత్త రూల్స్‌ తెలుసా..?

ఈవీల సబ్సిడీకి కొత్త పథకం

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే!

Eenadu.net Home