కార్లలో ఎన్ని రకాలున్నాయో తెలుసా?

హ్యాచ్‌బ్యాక్‌

ఈ కార్లలో ఇంజిన్‌, సిట్టింగ్‌ స్పేస్‌ మాత్రమే ఉంటాయి. వెనకభాగంలో ‘బూట్‌ (డిక్కీ)’ స్పేస్‌ తక్కువగా ఉంటుంది. ఈ కార్లు సైజ్‌లో చిన్నగా ఉండటంతో వీధుల్లోనూ చక్కగా నడిపించొచ్చు. 

ఉదా: హ్యుండాయ్‌ ఐ20, మారుతీ సుజూకీ స్విఫ్ట్‌

సెడాన్‌

వీటిల్లో ఇంజిన్‌, సిట్టింగ్‌ స్పేస్‌తోపాటు లగేజ్‌ పెట్టుకోవడానికి ప్రత్యేకంగా ‘బూట్‌(డిక్కీ)’ ఉంటుంది. లగేజ్‌తో దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే ఈ కారు మంచి ఆప్షన్‌. పొడవుగా ఉండటం వల్ల పార్కింగ్‌, టర్నింగ్‌లో ఇబ్బందులుంటాయి. 

ఉదా: మారుతీ సుజుకీ డిజైర్‌, హోండా అమేజ్‌

ఎస్‌యూవీ (స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్‌)

స్పోర్ట్స్‌ కార్లకు ఉన్నట్లు పవర్‌ఫుల్‌ ఇంజిన్‌, భారీ టైర్లు ఉంటాయి. ఇవి స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తూ.. ఆఫ్‌రోడ్‌ ప్రయాణాలకూ కూడా పనికొస్తాయి. కొన్నింట్లో మూడు వరుసల సిట్టింగ్‌ స్పేస్‌ ఉంటుంది.

ఉదా: టొయోటా ఫార్చునర్‌, మహీంద్ర స్కార్పియో

ఎంయూవీ (మల్టీ యుటిలిటీ వెహికల్‌)

వీటిని ఎంపీవీ(మల్టీ పర్పస్‌ వెహికల్‌) అని కూడా పిలుస్తారు. ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలుగా మూడు వరుసల్లో సిట్టింగ్‌ స్పేస్‌ ఉంటుంది. బూట్‌ స్పేస్‌ తక్కువగా ఉంటుంది. పరిమాణంలో చాలా పెద్దవి.

ఉదా: టయోటా ఇన్నొవా, మారుతీ ఎర్టిగా  

కన్వర్టబుల్‌

కార్‌ రూఫ్‌ను మడచి బూట్‌లో పెట్టే(మాన్యువల్‌/ఆటోమెటిక్‌) వెసులుబాటు ఉంటుంది. రూఫ్‌లెస్‌/టాప్‌లెస్‌ కార్లుగా పిలుస్తుంటాం. మన దేశంలో ఇలాంటి కార్లు తక్కువగా కనిపిస్తాయి. లగ్జరీ కార్లు కావడంతో ధర కూడా ఎక్కువే.

ఉదా: బీఎండబ్ల్యూ జెడ్‌4, ఆస్టన్‌ మార్టిన్‌ డీబీ11

సీయూవీ (క్రాస్‌ఓవర్‌ యుటిలిటీ వెహికల్‌)

హ్యాచ్‌బ్యాక్‌, ఎస్‌యూవీ కార్ల ఫీచర్లను కలిపి రూపొందించిన కార్లివీ.. పెద్ద టైర్లు, ఎక్కువ సీటింగ్‌ కెపాసిటీ, పవర్‌ఫుల్‌ ఇంజిన్‌ ఉంటాయి. బూట్‌(డిక్కీ) ప్రత్యేకంగా ఉండదు.

ఉదా: హోండా సీఆర్‌-వీ, టాటా టియాయో ఎన్‌ఆర్‌జీ

కూపే

ఇవీ స్పోర్ట్స్‌ కార్లే. చూడటానికి స్టైల్‌గా ఉంటాయి. కానీ, ఎత్తు చాలా తక్కువ. కొన్ని కార్లలో కేవలం రెండు సీట్లు మాత్రమే ఉంటాయి. సెకన్లలోనే పికప్‌ గంటలకు 100 కి.మీ.కి చేరుకుంటుంది. ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది.

ఉదా: ఆస్టన్‌ మార్టిన్‌ డీబీ12, జాగ్వార్‌ ఎఫ్‌ టైప్‌

పికప్‌ ట్రక్స్‌

వస్తువుల రవాణాకు ఉపయోగపడే వాహనాలివి. ముందుభాగంలో మనుషులు కూర్చోవడానికి, వెనక భాగంలో సరుకులు పెట్టడానికి స్థలం ఉంటుంది. ఎస్‌యూవీ ఫీచర్లు ఉండే ఈ వాహనాలు ఆఫ్‌-రోడ్‌లో దూసుకెళ్తాయి.

ఉదా: మహీంద్ర బొలెరో కాంఫర్‌, టాటా గ్జినాన్‌

ఎఫ్‌ అండ్‌ ఓ కొత్త రూల్స్‌ తెలుసా..?

ఈవీల సబ్సిడీకి కొత్త పథకం

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే!

Eenadu.net Home