మ్యూచువల్ ఫండ్స్.. ఈ విషయాలు తెలుసుకోండి!
అధిక రాబడి కోసం పెట్టుబడి మార్గాలు అనేకమున్నాయి. వాటిలో మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. ఇందులోనూ మూడు రకాలున్నాయి. అవేంటంటే..
Image: RKC
ఈక్విటీ ఫండ్స్
మదుపర్ల నుంచి సమీకరించిన డబ్బును వివిధ కంపెనీల షేర్లలో మదుపు చేయడాన్ని ఈక్విటీ ఫండ్స్ అంటారు. ఈ పెట్టుబడులు ఎక్కువ రాబడినిస్తాయి. అలాగే ఎక్కువ నష్టభయమూ ఉంటుంది.
Image: RKC
నష్టాలను భరించగలిగేవాళ్లు.. ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్లు ఈ ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. దీర్ఘకాలం వీటిని కొనసాగిస్తేనే అధిక లాభం ఉంటుంది.
Image: RKC
ఈక్విటీ ఫండ్స్‌లో మంచి లాభాలున్న సమయం చూసి కొనుగోళ్లు.. విక్రయాలు జరపాల్సి ఉంటుంది. లేదంటే నష్టం వాటిల్లుతుంది.
Image: RKC
డెట్ ఫండ్స్
ప్రభుత్వ బాండ్లు, ట్రెజరీ బిల్స్, సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టడాన్ని డెట్ ఫండ్స్ అంటారు. వీటిలో నష్టభయం చాలా తక్కువ. ముందుగానే వడ్డీ రేటు ఎంతో చెబుతారు కాబట్టి.. నష్టం.. ఆదాయంపై స్పష్టత ఉంటుంది.
Image: RKC
నష్టపోకుండా.. స్థిరమైన రాబడి కోరుకునే వారు ఈ డెట్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. స్వల్పకాలిక పెట్టుబడులకు ఇవి మంచి ఎంపిక.
Image: RKC
డెట్ ఫండ్స్‌లో ఎప్పుడైనా కొనుగోలు చేయొచ్చు. ఎప్పుడైనా విక్రయించుకోవచ్చు. రాబడిలో ఎలాంటి మార్పు ఉండదు
Image: RKC
బ్యాలన్స్‌డ్ ఫండ్స్
పెట్టుబడికి స్థిరత్వం, వృద్ధిని కల్పించే విధంగా పెట్టుబడిలో కొంత శాతం షేర్లలో, కొంతశాతం బాండ్లలో పెట్టుబడి పెడితే దాన్ని బ్యాలన్స్‌డ్ ఫండ్స్ అంటాం.
Image: RKC
ఫండ్ మేనేజర్లు.. మన పెట్టుబడులను స్టాక్ మార్కెట్ అనుకూలంగా లేనప్పుడు డెట్‌లోకి.. వడ్డీ రేట్లు అనుకూలంగా లేనప్పుడు ఈక్విటీలోకి మారుస్తూ బ్యాలన్స్ చేస్తుంటారు.
Image: RKC