.

బెంగళూరుకు చెందిన అల్ట్రా వయొలెట్ సంస్థ మార్కెట్లోకి ఎఫ్‌77 మాచ్‌ 2 బైక్‌ విద్యుత్ బైక్‌ను సెప్టెంబర్‌ 20న లాంచ్‌ చేసింది.

ఈ బైక్‌ రెండు బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది. టర్బో రెడ్‌, ప్లాస్మా రెడ్‌, ఎల్లో, స్టెల్త్‌ గ్రే, ఆస్టరాయిడ్‌ గ్రే, కాస్మిక్‌ బ్లాక్‌, సిల్వర్‌, వైట్‌, బ్లూ రంగుల్లో దీన్ని తీసుకొచ్చారు.

7.1 kWh స్టాండర్డ్‌ వేరియంట్‌ ధర రూ.2.99 లక్షలు కాగా.. 10.3 kWh రీకాన్‌ వేరియంట్‌ ధర రూ.3.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

స్టాండర్డ్‌ వేరియంట్‌ ఒక్కసారి ఛార్జింగ్‌తో 211కి.మీ రేంజ్‌ ఇస్తుంది. టాప్‌ స్పీడ్‌ 155kmph.

ఇక రీకాన్‌ వేరియంట్‌ సింగిల్‌ ఛార్జింగ్‌తో 300కి.మీ వరకు ప్రయాణిస్తుంది. టాప్‌ స్పీడ్‌ 155kmph.

గంట పాటు ఛార్జింగ్‌ చేస్తే ఈ బైక్స్‌ 35km రేంజ్‌ ఇస్తాయని కంపెనీ చెబుతోంది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది.

వీటిల్లో ఇ- సిమ్‌ కనెక్టివిటీ సదుపాయం ఉంది. టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే లేదు.

స్టాండర్డ్‌ వేరియంట్‌కు 3ఏళ్ల లేదా 60,000కి.మీ వరకు వారెంటీ ఇచ్చారు.

రీకాన్‌ వేరియంట్‌కు 8ఏళ్లు లేదా 8,00,000కి.మీ వరకు వారెంటీ అందిస్తోంది.

భారత్‌లో టాప్‌-10 ధనికులు వీరే!

సంపాదించడంలోనే కాదు పొదుపులోనూ శ్రద్ధ ఉండాలి..

ఫ్యూయల్‌పై రివార్డులందించే కార్డులివే..

Eenadu.net Home