ఐపీఎల్‌లో బ్రేక్‌ కాని రికార్డులు 

‘కింగ్‌’ను దాటగలరా?  

ఈ సీజన్‌లో అదరగొట్టిన బెంగళూరు స్టార్‌ ప్లేయర్ విరాట్ కోహ్లీ 741 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే లీగ్‌లో 8004 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇప్పట్లో ఈ రికార్డును మరే ఆటగాడు బ్రేక్ చేసే ఛాన్స్ లేదు. 

బౌండరీల్లో ధావన్‌ 

శిఖర్‌ ధావన్ 768 ఫోర్లు బాది అత్యధిక బౌండరీలు కొట్టిన ఆటగాడిగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ (705) రెండో స్థానంలో నిలిచాడు. 

సిక్సర్లలో క్రిస్‌ గేల్

విధ్వంసకర క్రికెటర్ క్రిస్‌ గేల్‌ ఐపీఎల్‌లో ఏకంగా 357 సిక్సర్లు బాదాడు. రోహిత్ శర్మ (280) సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ రికార్డు కూడా ఇప్పట్లో బద్దలయ్యే అవకాశం లేదు. 

175* ఇంకా పదిలం

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (175*) క్రిస్‌ గేల్ పేరిట ఉంది. 2013లో బెంగళూరు తరఫున పుణె వారియర్స్‌పై ఈ ఘనత సాధించాడు. 2024 సీజన్‌లోనూ ఈ రికార్డు బ్రేక్‌ కాలేదు. 

చాహల్ డబుల్ సెంచరీ 

యుజ్వేంద్ర చాహల్ ఈ సీజన్‌లో 18 వికెట్లు పడగొట్టి టోర్నీలో వికెట్లలో డబుల్ సెంచరీ సాధించాడు. 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ప్రస్తుతం 205 వికెట్లతో టాప్‌లో ఉండగా.. పీయూష్ చావ్లా (192 వికెట్లు) రెండో స్థానంలో ఉన్నాడు.  

బెస్ట్ బౌలింగ్‌ పెర్ఫామెన్స్‌  

ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (6/12) అల్జారీ జోసెఫ్‌ పేరిట ఉంది. 2019లో ముంబయి తరఫున హైదరాబాద్‌పై ఈ ఫీట్ సాధించాడు. ఈ రికార్డు ఇంకా బద్దలవ్వలేదు. 

అప్పటి స్పిన్నర్లే ఇంకా టాప్‌లో

పొదుపుగా బౌలింగ్‌ చేసిన బౌలర్ల లిస్ట్‌లో మాజీ ఆటగాళ్లు డేనియల్ వెటోరి (6.56 ఎకానమీ), అనిల్ కుంబ్లే (6.58 ఎకానమీ) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో నరైన్‌ (6.73 ఎకానమీ) అత్యుత్తమంగా ఉన్నాడు.  

భువీ ఫస్ట్.. నరైన్ సెకండ్ 

భువనేశ్వర్‌ కుమార్‌ అత్యధిక డాట్ బాల్స్‌ (1670) వేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నరైన్ (1605) రెండో స్థానంలో ఉన్నాడు.

ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు

ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ (973 రన్స్, 2016లో) పేరిట ఉంది. ఈ సీజన్‌లోనూ ఆ రికార్డు చెక్కుచెదరలేదు. 2023లో శుభ్‌మన్ గిల్ 890 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.  

ఒక సీజన్‌లో ఎక్కువ సిక్స్‌లు

2012లో క్రిస్‌ గేల్ ఏకంగా 59 సిక్స్‌లు బాదాడు. రస్సెల్ 2019లో 52 సిక్స్‌లు కొట్టాడు. ఈ సారి కూడా 59 సిక్స్‌లు రికార్డు చెక్కు చెదరలేదు. 

32 ఇంకా దాటలే..  

2021 సీజన్‌లో హర్షల్‌ పటేల్ బెంగళూరు తరఫున 32 వికెట్లు (15 మ్యాచ్‌ల్లో) తీశాడు. డ్వేన్ బ్రావో కూడా 2013లో చెన్నై తరఫున 32 వికెట్లు (18 మ్యాచ్‌ల్లో) పడగొట్టాడు. తర్వాత ఎవరూ ఈ రికార్డును బ్రేక్ చేయలేదు. 

అత్యధిక టైటిళ్లు 

ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ రికార్డుస్థాయిలో ఐదేసిసార్లు ఛాంపియన్‌గా నిలిచాయి. ఈ సీజన్‌లో ఆరో టైటిల్‌ గెలవడానికి ఈ రెండు జట్లు అవకాశం ఉన్నా కనీసం ప్లేఆఫ్స్‌కు రాలేదు.  

టెస్టు చరిత్రలో టాప్‌ 10 భారీ ఇన్నింగ్స్‌లు

టెస్టుల్లో 50+ స్కోర్లు.. టాప్‌ 5 ప్లేయర్లు!

టెస్టుల్లో అత్యధిక సెంచరీలు.. ఆరుకొచ్చిన రూట్‌

Eenadu.net Home