బాలకృష్ణ.. జీవన విధానమిదీ
#eenadu
తెల్లవారుజామున మూడున్నరకు లేచి.. గంటపాటు వ్యాయామం చేస్తుంటారు. సూర్యోదయానికి ముందే పూజ అయిపోతుంది.
తన తండ్రి ఎన్టీఆర్ సినిమాలు తప్ప వేరేవి చూడరు. రోజూ ఎన్టీఆర్ చిత్రం చూశాకే నిద్రకు ఉపక్రమిస్తారు.
వార్తా పత్రికలు చదువుతారు. పుస్తక పఠనం తక్కువే. ఎక్కువగా సినిమా కథల గురించి ఆలోచిస్తుంటారు.
మనసుకు నచ్చిందే చేస్తారు. డైట్ పేరుతో నోరు కట్టేసుకోరు. పాత్రలకు తగ్గట్టు శరీరాకృతి మార్చుకుంటారు.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబం కోసం కొంత సమయాన్ని కేటాయించి, సరదాగా గడుపుతారు
తన విజయం వెనుక సతీమణి వసుంధర పాత్ర ఎంతో ఉందనే ఆయన.. తనను కంటికి రెప్పలా చూసుకుంటుందని చెబుతుంటారు.
మనవళ్లతో ఉన్నప్పుడు చిన్న పిల్లాడిలా మారిపోతారు. వారిని సీఎం (క్లాస్ మనవడు), ఎంఎం (మాస్ మనవడు) అని పిలుస్తుంటారు.
అప్పట్లో క్రికెట్ ఎక్కువగా ఆడేవారు. స్కూల్‌డేస్‌లో టేబుల్ టెన్నిస్ ఛాంపియన్. బాస్కెట్ బాల్, కబడ్డీ టీమ్ కెప్టెన్‌గా ఉండేవారు.
ఎన్టీఆర్ ఇచ్చిన డిజైన్ ఆధారంగానే బాలకృష్ణ ఇల్లు నిర్మించుకున్నారు.
లక్ష్మీనరసింహ స్వామి అంటే అమితమైన భక్తి. సినిమాల పరంగా సింహా పేరు ఆయనకు సెంటిమెంట్ అని చెప్పొచ్చు.
తెలుగు అంటే మమకారం. ఓ మాస్టారు బాలకృష్ణకు పద్యాలు నేర్పేవారు. నేర్చుకోకపోతే తొడపాశం పెడతారనే భయంతో కంఠతా పట్టేవారు.
నెగెటివ్ ఆలోచనలు, కల్మషం లేకపోవడమే తన ఆరోగ్య రహస్యమని ఓ సందర్భంలో చెప్పారు.