అలా.. ఏకైక భారతీయ నటుడు రజనీకాంత్‌

#Eenadu

అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. బస్‌ కండక్టర్‌గా కంటే ముందు కూలీగా, కార్పెంటర్‌గా వర్క్‌.

తొలి చిత్రం ‘అపూర్వ రాగంగళ్‌’ (తమిళం). తెలుగులో ‘అంతులేని కథ’.

కెరీర్‌ ప్రారంభంలో విలన్‌గానూ సందడి. 1978లో 20కు పైగా చిత్రాల్లో యాక్టింగ్‌.

హీరోగా నటించిన ‘భైరవి’ (1978) ఘన విజయంతో ‘సూపర్‌స్టార్‌’ ట్యాగ్‌.

సీబీఎస్‌ఈ పాఠ్య పుస్తకాల్లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నటుడు. ‘ఫ్రమ్‌ బస్‌ కండక్టర్‌ టు ఫిల్మ్‌స్టార్‌’ పేరుతో పాఠ్యాంశం

సంపాదనలో 50 శాతం సేవా కార్యక్రమాలకే కేటాయింపు. హిమాలయాల్లో స్థిరపడాలన్నది చిరకాల కోరిక.

2007లో.. ఆసియాలోనే అత్యధిక పారితోషికం అందుకున్న రెండో నటుడు. జాకీ చాన్‌ది తొలిస్థానం.

‘మన్నన్‌’, ‘కొచ్చడైయాన్‌’లోని కొన్ని పాటలకు సింగర్‌. వల్లి (1993), ‘బాబా’ (2002) చిత్రాలకు స్క్రీన్‌ రైటర్‌.

పద్మభూషణ్ (2000), పద్మ విభూషణ్‌ (2016), దాదా సాహెబ్‌ ఫాల్కే (2019) అవార్డు గ్రహీత.

డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతే డబ్బుని తిరిగిచ్చే సంస్కృతిని పరిచయం చేసిన నిర్మాత.

ఇటీవల ‘వేట్టయన్‌’తో సందడి. ప్రస్తుతం 171వ చిత్రం ‘కూలీ’తో బిజీ.

ఇండియన్‌ సినిమా: రూ.1000+ కోట్లు వసూళ్ల చిత్రాలివే

ఇడ్లీ కోసమే మైసూర్‌ వెళ్లా!

‘పుష్ప 2’.. రికార్డులే రికార్డులు!

Eenadu.net Home