ఆ హీరోలా లైఫ్‌ లీడ్‌ చేయాలనుంది..

#Eenadu

విభిన్న పాత్రలనే ఎంపిక చేసుకునే ఈ నటి ‘రగు తాత’లో.. హిందీ రాని తమిళమ్మాయిగా నవ్విస్తూనే.. మంచి సందేశం ఇవ్వనున్నారు.

సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ సినిమాని తమిళ్‌లోనే రిలీజ్‌ చేస్తుండడం గమనార్హం.

ఇప్పటికే కోలీవుడ్‌లో మరో రెండు ప్రాజెక్టుల్లో భాగమయ్యారు కీర్తి. ‘రివాల్వర్‌ రీటా’, ‘కన్నివేడి’.. దేనికదే ప్రత్యేకం. 

సుహాస్‌, కీర్తి నటించిన ‘ఉప్పు కప్పురంబు’ మూవీ త్వరలో నేరుగా ‘అమెజాన్‌ ప్రైమ్‌’లో రిలీజ్‌ కానుంది.

‘బేబీ జాన్‌’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తమిళ్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘తెరి’కి రీమేక్‌ ఇది. వరుణ్‌ ధావన్‌ హీరో. డిసెంబరు 25న విడుదల.

రీమేక్స్‌లో నటించేందుకు పెద్దగా ఆసక్తి లేకపోయినా ‘తెరి’లోని హీరోయిన్‌ పాత్ర నచ్చడంతో నటిస్తున్నానని ఓ సందర్భంలో తెలిపారు.

ఇన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా.. ప్రభాస్‌ ‘కల్కి’లోని బుజ్జి వాహనానికి వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం విశేషం.

‘దసరా’లోని నటనకుగానూ ఇటీవల సౌత్‌ ఫిలిం ఫేర్‌ పురస్కారం అందుకున్నారు.  

నటన విషయంలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచే కీర్తి.. ‘నా ఇన్‌స్పిరేషన్‌ అమ్మ మేనక’ అని చెబుతుంటారు.

ఎన్టీఆర్‌తో కలిసి నటించాలనుందని, ఒక్క రోజు అల్లు అర్జున్‌లా లైఫ్‌ లీడ్‌ చేయాలనుందని ఓ వేదికపై మనసులో మాట బయటపెట్టారు.

సద్విమర్శలు స్వీకరించే ఈ నటి.. ‘సింగిల్‌ అని నేను చెప్పలేదుగా’ అంటూ ఓ ప్రశ్నకు సమాధానమివ్వడంతో.. ఆమె రిలేషన్‌షిప్‌లో ఉన్నారని నెట్టింట టాక్‌ నడుస్తోంది.

ఇండియాలో టాప్‌- 10 ‘గూగుల్డ్‌’ షోస్‌

సెలెనా గోమెజ్‌... పెళ్లి వార్తతో వైరల్‌

లవ్లీ లావెండర్‌... లవ్లీ పోజులు

Eenadu.net Home