చిత్రం చెప్పే విశేషాలు!

(19-11-2022/2)

ఎన్టీఆర్‌ మార్గ్‌లో నూతనంగా నిర్మించిన ఫార్ములా రేసింగ్‌ ట్రాక్‌ వద్ద ట్రయల్‌ రేసును ప్రారంభించి తిలకిస్తున్న మంత్రి కేటీఆర్‌.

source:Eenadu

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు వైకాపా ప్రభుత్వ తీరును విమర్శిస్తూ మంళగిరిలోని తెదేపా కార్యాలయంలో ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు చెందిన నూతన బుల్లెట్‌ ద్విచక్రవాహనాలను ఆయన ప్రారంభించారు.

source:Eenadu

ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా జనసేన పార్టీ హైదరాబాద్‌ కేంద్ర కార్యాలయంలో శనివారం ఉదయం పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఆమె చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వీర మహిళలనుద్దేశించి పవన్‌ మాట్లాడారు.

source:Eenadu

తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొని కోలాటమాడి సందడి చేశారు.

source:Eenadu

హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో నిర్వహించిన హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌లో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

source:Eenadu

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆల‌యంలో శనివారం శాస్త్రోక్తంగా ల‌క్ష కుంకుమార్చ‌న‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

source:Eenadu

నల్గొండ పట్టణంలోని మేకల అభినవ్‌ అవుట్‌డోర్‌ స్టేడియంలో ఎస్సై కొలువుల ఈవెంట్స్‌ కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత శిక్షణనిస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసు అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో అభ్యర్థులు సాధన చేస్తున్నారు.

source:Eenadu

వారాంతం కావడంతో మలేసియన్ టౌన్‌షిప్‌ కాలనీవాసులు కేపీహెచ్‌బీ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతూ సందడి చేశారు. మహిళలు, యువతులు కేరింతలు కొడుతూ ఆటగాళ్లలో హుషారు నింపారు. వారాంతాల్లో ఆటలు ఆడుతూ ఉద్యోగ ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందుతున్నట్లు వారు తెలిపారు.

source:Eenadu

నెల్లూరు శ్రీ వేంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో జిల్లా యువజన ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఓ విద్యార్థిని ఇచ్చిన మహిషాసుర మర్దని నృత్యరూపకం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.

source:Eenadu

మీ జీవితపు స్టీరింగును వేరొకరికి ఇవ్వొద్దు

చెఫ్‌ డే సెలబ్రేషన్స్‌

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home