ఒక మూవీ వద్దు.. రెండు తీస్తేనే ముద్దు..!

కెప్టెన్‌ మిల్లర్‌.. 

ధనుష్‌ హీరోగా నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ రెండు భాగాలుగా రానుందట. అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకుడు. శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌, ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

‘పుష్ప’ ఫైర్‌

బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాదు.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కు అవార్డును తెచ్చి పెట్టింది ‘పుష్ప’. ఇప్పటికే రెండో భాగం షూటింగ్‌ ఫుల్‌ స్వింగ్‌లో ఉంది.

‘డైనోసర్‌’ డబుల్‌ ఇంపాక్ట్‌

2023లో బాక్సాఫీస్‌కు ఘనమైన వీడ్కోలు పలికేందుకు ‘డైనోసర్‌’ సిద్ధమైంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న ‘సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ఫైర్‌’ డిసెంబరు 22న విడుదల కానుంది.

‘దేవర’ ఒక్కటి కాదు..

ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త ఎన్టీఆర్‌ను ‘దేవర’లో చూడబోతున్నారు. కొరటాల శివ ‘దేవర’ను రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారు. జాన్వీ కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌ ఈ మూవీకి అదనపు ఆకర్షణ.

మూడు భాగాల బ్రహ్మాస్త్ర

ఒక కథ రెండు భాగాలవుతుంటే.. అయాన్‌ ముఖర్జీ ఏకంగా మూడు ముక్కలు చేశాడు. ఇప్పటికే ‘బ్రహ్మాస్త్ర:శివ’ విడుదలై అలరించగా, త్వరలోనే ‘బ్రహ్మాస్త్ర2: దేవ్‌’, ‘బ్రహ్మాస్త్ర-3’ పట్టాలెక్కనున్నాయి.

మోహన్‌లాల్‌దీ అదే బాట

‘దృశ్యం’ చిత్రాలతో ప్రేక్షకులను కట్టిపడేశారు మోహన్‌లాల్‌-జీతూ జోసెఫ్‌. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘రామ్‌’. రెండు భాగాలుగా ఇది విడుదల కానుంది. 

నెరవేరిన మణిరత్నం కల

మణిరత్నం దర్శకత్వంలో రెండు భాగాలుగా వచ్చిన ‘పొన్నియిన్‌సెల్వన్‌’ తమిళ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌, కార్తి, జయం రవి కీలక పాత్రలు పోషించారు.

రాఖీభాయ్‌ అదరగొట్టాడు

ప్రశాంత్‌ నీల్‌, యశ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘కేజీయఫ్‌’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన సంగతి తెలిసిందే. 

 ‘బాహుబలి’ గురించి చెప్పేది ఏముంది?

ఒక కథను రెండు భాగాలుగా చెప్పి, భారతీయ సినిమాను ‘బాహుబలి’ రూపంలో ప్రపంచస్థాయికి తీసుకెళ్లారు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ప్రభాస్‌, అనుష్క, రానా కీలక పాత్రలు పోషించారు.

తెలుగు హీరో.. మలయాళీ విలన్‌!

‘యానిమల్‌’ త్రిప్తి గురించి తెలుసా?

సిల్క్‌స్మితగా చంద్రిక

Eenadu.net Home