#eenadu

వన్‌ప్లస్‌ 11 ఆర్‌టీ (OnePlus 11 RT)

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్‌ప్లస్‌ 11ఆర్‌టీ ఫోన్‌ ఈ నెలలో రాబోతోంది. ఈ ఫోన్‌ 5,000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 2 ప్రాసెసర్‌తో రానుంది. దీని ధర రూ.40 వేలు ఉండొచ్చు.

లావా బ్లేజ్ 2 5జీ

దేశీయ కంపెనీ లావా.. ఇది వరకే విడుదల చేసిన బ్లేజ్‌ 2కు మరికొన్ని ఫీచర్లు జోడించి బ్లేజ్‌ 2 5జీ ఫోన్‌ను తీసుకొస్తోంది. దీని ధర రూ.10 వేలు ఉండొచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌తో రానుంది.

శాంసంగ్‌ గెలాక్సీ ఎం44 5జీ (Samsung Galaxy M44 5G)

6,000mAh బిగ్‌ బ్యాటరీతో శాంసంగ్‌ ఈ ఫోన్‌ తీసుకొస్తోంది. 50 ఎంపీ ప్రధాన కెమెరాతో వస్తున్న ఈ ఫోన్‌ ధర రూ.20 వేల్లోపే ఉండే అవకాశం ఉంది.

నథింగ్‌ నుంచి కొత్త ఫోన్‌ 

నథింగ్‌ మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. గ్రీన్‌, పింక్‌, ఎల్లో రంగుల్లో స్నాప్‌ డ్రాగన్‌ 700 ప్రాసెసర్‌తో తీసుకురానుంది. దీని ధర రూ.30వేల్లోపు ఉండొచ్చు.

షావోమీ 14 ప్రో (Xiaomi 14 pro)

చైనాలో విడుదలైన షావోమీ 14 ప్రో మొబైలను ఈ నెలలోనే భారత్‌కు రానుంది. 6.7 అంగుళాల QHD+ ఆమోలెడ్‌ స్క్రీన్‌, స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్‌ హైపర్‌ ఓఎస్‌తో రానుంది.

రియల్‌మీ జీటీ 5 ప్రో

స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 3 ప్రాసెసర్‌తో రియల్‌మీ జీటీ 5 ప్రో మొబైల్‌ను తీసుకురానుంది. 6.7 అంగుళాల ఆమోలెడ్‌ 2K స్క్రీన్‌తో వస్తున్న ఈ ఫోన్‌ నవంబర్‌ నెలాఖరులో తీసుకురానున్నారు.

వన్‌ప్లస్‌ 12 ఆర్‌ (OnePlus 12R)

బ్యాటరీ, డిస్‌ప్లేలో మెరుగైన మార్పులతో స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 2 ప్రాసెసర్‌తో వన్‌ప్లస్‌ 12 ఆర్‌ మొబైల్‌ను వన్‌ప్లస్‌ ఈ నెలలోనే తీసుకురానుంది. ఇటీవల చైనాలో లాంచ్‌ చేసిన వన్‌ప్లస్‌ ఏస్‌2 ప్రోనూ తీసుకురావొచ్చు.

రెడ్‌మీ నోట్‌ 13 ప్రో (Redmi note 13 pro)

200 MP ప్రధాన కెమెరాతో తన 13 ప్రో సిరీస్‌లో రెడ్‌మీ రెండు కొత్త మొబైల్స్‌ని లాంచ్‌ చేయనుంది. రెడ్‌మీ నోట్‌ 13 ప్రో, నోట్‌ 13 ప్రో ప్లస్‌ పేరుతో ఈ ఫోన్లు రానున్నాయి.

పోకో ఎక్స్‌6 ప్రో (Poco x6 pro)

200MP ప్రధాన కెమెరాతో రానున్న మరో ఫోన్ పోకో ఎక్స్‌6 ప్రో. స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 2 ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ రానుంది. దీని ప్రారంభ ధర రూ.23గా ఉండనుంది.

వివో వై 78 5జీ (Vivo Y78 5G)

తక్కువ బడ్జెట్‌లో 5,000mAh బ్యాటరీ సదుపాయంతో వివో వై78 5జీ ఫోన్‌ను నవంబర్‌లో లాంచ్‌ చేయనుంది. స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌తో రానున్న ఈ ఫోన్‌ ధర రూ.16 వేలుగా ఉండొచ్చు.

బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ ధరించిన చీరల విశేషాలు

క్రెడిట్‌ స్కోరు పెంచే 8 టిప్స్‌

యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ను చూడాలంటే ఇలా చేయండి..

Eenadu.net Home