ఊరు.. సినిమా పేరై!
#eenadu
జపాన్
కార్తి హీరోగా రాజు మురుగన్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. తమిళనాడుకు చెందిన ఓ దొంగ కథ ఆధారంగా రూపొందింది. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. కార్తికి జపాన్ పేరెందుకు పెట్టారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. దీపావళికి ప్రేక్షకుల ముందుకురానుంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయిన్. ఏపీలోని గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబరు 8న విడుదల కానుంది.
గుంటూరు కారం
‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతోన్న చిత్రమిది. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. 2024 జనవరి 12న ఏపీలోని గుంటూరు కారం ఘాటు రుచి చూపించనుందీ సినిమా.
అంబాజీపేట మ్యారేజి బ్యాండు
సుహాస్ , శివానీ జంటగా నటించిన ఈ సినిమాకి దుశ్యంత్ కటికనేని దర్శకుడు. ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట ఇతివృత్తంగా సాగుతుందీ సినిమా. అతి త్వరలో విడుదల.
ఊరు పేరు భైరవకోన
సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్ ప్రధాన పాత్రల్లో వి.ఐ. ఆనంద్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఏపీలోని ప్రకాశం జిల్లాలోని భైరవకోన నేపథ్యంలో దీన్ని రూపొందిస్తున్నారా, కల్పిత ప్రాంతమా? తెలియాల్సి ఉంది. విడుదల ఖరారుకాలేదు.
కోట బొమ్మాళి పి.ఎస్.
శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు తేజ మార్ని రూపొందిస్తున్న చిత్రమిది. అతి త్వరలోనే విడుదలకానుంది. శ్రీకాకుళం జిల్లాలోని కోట బొమ్మాళి నేపథ్యంలో సాగుతుందీ కథ.