#eenadu

యాపిల్‌ ఐఫోన్‌ 16 సిరీస్‌ సహా చాలా ఫోన్లు సెప్టెంబర్‌ నెలలో లాంచ్‌ అయ్యాయి. 

ఆఫర్లు కూడా దీనికి తోడవ్వడంతో సెప్టెంబర్‌ అంతా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో సందడి వాతావరణం నెలకొంది.

అక్టోబర్‌లోనూ సందడి చేసేందుకు మరికొన్ని ఫోన్లు సిద్ధమవుతున్నాయి. ఆ ఫోన్లేంటో చూసేయండి మరి!

వన్‌ప్లస్‌ 13

వన్‌ప్లస్‌ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ వన్‌ప్లస్‌ 13 చైనాలో అక్టోబర్‌లో లాంచ్‌ కానుంది. కొన్ని రోజులకే భారత్‌లోనూ ఎంట్రీ ఇవ్వనుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 4.. 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 100W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో ఈ ఫోన్‌ రానుంది.

లావా అగ్ని3 

దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా అగ్ని3ని అక్టోబర్‌ 4న లాంచ్‌ చేయనుంది. వెనుకవైపు కెమెరా పక్కన మరో డిస్‌ప్లేతో ఈ ఫోన్ వస్తుండడం విశేషం.

ఐకూ 13 

వివో సబ్‌బ్రాండ్‌ ఐకూ 13 ఫోన్‌ కూడా ఈ నెలలో చైనాలో లాంచ్‌ కాబోతోంది. ఇది కూడా స్నాప్‌డ్రాగన్‌ 8జెన్‌ 4 ప్రాసెసర్‌తో వస్తోంది. కొద్ది రోజులకే భారత మార్కెట్‌లోకి రానుంది.

ఇన్‌ఫినిక్స్‌ జీరో ఫ్లిప్‌

ఇన్‌ఫినిక్స్‌ కంపెనీ తొలిసారి ఫ్లిప్ ఫోన్‌ను భారత మార్కెట్లో అక్టోబర్‌లో లాంచ్‌ చేయబోతోంది. 6.9 అంగుళాల ఎల్‌టీపీఓ అమోలెడ్‌ డిస్‌ప్లేతో రాబోతోంది. ఎంత ధరకు తీసుకొస్తారో చూడాలి మరి! 

శాంసంగ్‌ ఎస్‌24 ఎఫ్‌ఈ

ఎస్‌24కి కొనసాగింపుగా ఫ్యాన్‌ ఎడిషన్‌ను ఇటీవల గ్లోబల్‌గా శాంసంగ్‌ లాంచ్‌ చేసింది. అక్టోబర్‌ 3 నుంచి దీని విక్రయాలు ప్రారంభంకానున్నాయి. బేస్‌ వేరియంట్‌ ధరను రూ.59,999గా నిర్ణయించారు.

స్మార్ట్‌ రింగ్‌లో డిస్‌ప్లే.. అదిరిపోయిందిగా!

ఈ ఏడాది వచ్చిన బెస్ట్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

సామాజిక మాధ్యమాలను సానుకూలంగానూ ఉపయోగించొచ్చు..

Eenadu.net Home