త్వరలో ఐఫోన్‌ SE4, పిక్సెల్‌ 9A.. ఇంకా!

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ మరోసారి కళకళలాడనుంది. యాపిల్‌, గూగుల్‌, వివో వంటి సంస్థలు మరికొన్ని రోజుల్లో వరుసగా స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేయనున్నాయి.

ఐఫోన్‌ ఎస్ఈ4

ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లతో అందుబాటు ధరలో ఐఫోన్‌ SE4 త్వరలో ఎంట్రీ ఇవ్వనుంది. ఎస్‌ఈ సిరీస్‌లో వస్తున్న నాలుగో ఫోన్‌ ఇది.

యాపిల్‌ లేటెస్ట్‌ ఏ18 చిప్‌సెట్‌తో ఇది రానుంది. మిడ్‌ రేంజ్‌లో వస్తున్న ఈ ఐఫోన్‌లో ఏఐ ఫీచర్లను జోడిస్తుండడం విశేషం. 

గూగుల్‌ పిక్సెల్‌ 9ఏ

మిడ్‌ రేంజ్‌లో గూగుల్‌ నుంచి రానున్న మరో మొబైల్‌ గూగుల్‌ పిక్సెల్‌ 9ఏ. మార్చిలో మన మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

గూగుల్ టెన్సర్‌ జీ4 చిప్‌సెట్‌, 8జీబీ ర్యామ్‌తో పిక్సె‌ల్‌ 9ఏ రానుంది. 48 ఎంపీ ప్రధాన కెమెరా, 13 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా ఉండొచ్చు.

ఒప్పో ఫైండ్‌ ఎన్‌5

ప్రపంచంలోనే అత్యంత పల్చని ఫోల్డబుల్‌ ఫోన్‌ ఒప్పో ఫైండ్‌ ఎన్‌5 త్వరలో చైనాలో లాంచ్‌ కానుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ ప్రాసెసర్‌తో తీసుకురానున్నారు.

ఇదే ఫోన్‌ వన్‌ప్లస్‌ ఓపెన్‌ 2 పేరిట గ్లోబల్‌ ఎంట్రీ ఇవ్వనుంది. 50ఎంపీ ప్రధాన కెమెరా, 50ఎంపీ అల్ట్రా వైడ్‌ కెమెరా, 50 ఎంపీ పెరీస్కోప్‌ లెన్స్‌ ఉంటాయి. 

నథింగ్‌ ఫోన్‌ 3ఏ

మార్చి 4న నథింగ్‌ ఫోన్‌ 3ఏ సిరీస్‌లో 3ఏ, 3ఏ ప్రో మొబైల్స్‌ లాంచ్‌ కానున్నాయి. ఏడాది చివర్లో నథింగ్‌ ఫోన్‌ 3 పేరుతో ఫ్లాగ్‌ షిప్‌ మోడల్‌ను లాంచ్‌ చేయనుంది. 

వివో వీ50

ఫిబ్రవరి 17న వివో వీ50 భారత్‌లో లాంచ్‌ కానుంది. లో- లైట్‌ ఇమేజెస్‌ను క్యాప్చర్‌ చేసేందుకు 50 ఎంపీ డ్యూయల్‌ కెమెరా సెటప్‌ ఉంది.

స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 ప్రాసెసర్‌తో వివో వీ50ని తీసుకురానున్నారు. 6000mAh బ్యాటరీతో ఈ మొబైల్‌ను తీసుకొస్తారు. 

దృశ్యం.. ఆరు రీమేక్‌లు.. అరుదైన రికార్డులు..

ఖుషి కపూర్‌ ‘స్కూల్‌డేస్‌’ మెమొరీస్‌.. సింపుల్‌గా నేహా

క్రెడిట్‌ కార్డుతో ఈ తప్పులు చేయొద్దు!

Eenadu.net Home