యూపీఐలో ఈ ఏడాది వచ్చిన మార్పులు

అత్యంత ప్రజాదరణ పొందిన ఆన్‌లైన్‌ చెల్లింపుల సేవ యూపీఐ వినియోగదారుల సౌలభ్యం మేరకు అనేక కొత్త మార్పుల్ని ఈ ఏడాదిలో తీసుకొచ్చింది. 

యూపీఐ లావాదేవీ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులకు ఇది వర్తిస్తుంది.

పిన్‌ అవసరం లేకుండా చేసే యూపీఐ లైట్‌ లావాదేవీ పరిమితిని రూ.2 వేల నుంచి రూ.5వేలకు పెంచారు. ఒక్కో లావాదేవీ పరిమితిని సైతం రూ.500 నుంచి వెయ్యి రూపాయలకు పెంచారు.

యూపీఐ లైట్‌ వాలెట్‌ పరిమితి కంటే డబ్బులు తక్కువ ఉంటే ఆటోమేటిక్‌గా బ్యాంక్‌ ఖాతా నుంచి డబ్బులు టాప్‌ అప్‌ అయ్యే సదుపాయం కూడా ఈ ఏడాది అందుబాటులోకి వచ్చింది.

స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకుండా యూపీఐ సేవల్ని అందించేందుకు తీసుకొచ్చిన UPI123PAY పరిమితిని కూడా పెంచారు. రూ.5వేల నుంచి రూ.10వేలకు తీసుకొచ్చారు. మిస్ట్‌కాల్‌ లేదా IVR నంబర్‌ డయల్‌తో ఈ లావాదేవీలు జరపొచ్చు.

బ్యాంక్‌ ఖాతా లేని వారూ డిజిటల్‌ చెల్లింపులు చేసేందుకు కొత్తగా యూపీఐ సర్కిల్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చారు. సెకండరీ యూజర్‌ నెలకు గరిష్ఠంగా రూ.15 వేలు, ప్రతి లావాదేవీకి రూ.5వేలు వరకు ఖర్చు చేయొచ్చు.

మన దేశానికి మాత్రమే పరిమితమైన యూపీఐ సేవలు ఈ ఏడాదిలోనే ఫ్రాన్స్‌, శ్రీలంక, మారిషస్‌కూ విస్తరించాయి.

వాట్సప్‌ ఈ ఏడాది బెస్ట్‌ ఫీచర్లు ఇవీ..

స్కామర్ల కామన్‌ డైలాగ్స్‌ ఇవీ!

క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల్లో ఏ బ్యాంక్‌ వాటా ఎంత?

Eenadu.net Home