కిస్సిక్‌తో క్రేజ్.. ఎవరీ ఊర్వశి అప్సర
అల్లు అర్జున్‌తో ‘కిస్సిక్’ సాంగ్‌కి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఓ అమ్మాయి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె ఎవరా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో వెతకడం మొదలు పెట్టారు.
This browser does not support the video element.
ఈ వీడియోలో డ్యాన్స్ చేస్తున్న అమ్మాయి పేరు ఊర్వశి అప్సర. ‘పుష్ప 2’లో ‘కిస్సిక్’ సాంగ్‌కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసింది.
‘పుష్ప 1’లో ‘ఊ అంటావా మావా..’ సాంగ్‌కీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసింది.
‘కిట్టి పార్టీ’, ‘డిసెంబరు 31’, ‘అనంత్’, ‘పింటు కి పప్పి’లో నటించింది ఊర్వశి.
గుజరాత్‌లో పుట్టి పెరిగిన ఆమె వందకుపైగా పాటలకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేసింది.
2016లో డ్యాన్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆమె గణేశ్ ఆచార్య దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేస్తోంది.
2016 లో ‘మిస్ ముంబయి’ అందాల పోటిలో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది.
ఊర్వశి అప్సర బెల్లీ డ్యాన్సర్, యోగ శిక్షకురాలు కూడా. ఖాళీ సమయాల్లో డ్యాన్స్ చేస్తూ ఆ రీల్స్‌ని ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంటుంది.
ట్రావెల్ అండ్ సెల్ఫీ లవర్ ఊర్వశి. తనకు నచ్చిన అందాలను కెమెరాతో ‘కిస్సిక్’మనిపించి షేర్ చేస్తుంది.