టాలీవుడ్‌లో ‘స్పెషల్’ బ్యూటీ!
బాలీవుడ్ సుందరి ఊర్వశి రౌతేలా.. టాలీవుడ్‌పై కన్నేసింది. వరుసపెట్టి తెలుగు సినిమాల్లోని ప్రత్యేక గీతాల్లో తళుక్కున మెరుస్తోంది.
Image: Instagram/Urvashi Rautela
ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో ‘బాస్ పార్టీ’ పాటలో మెరిసింది. తొలిసారి తెలుగుతెరపై చిరుతో కలిసి హుషారుగా స్టెప్పులేసింది.
Image: Instagram/Urvashi Rautela
ఇటీవల విడుదలైన అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’లోనూ ‘వైల్డ్ సాలా’ పాటతో ఆకట్టుకుంది ఊర్వశి.
Image: Instagram/Urvashi Rautela
ఇప్పుడు మెగా హీరోలు పవన్ కల్యాణ్, సాయిధరమ్‌తేజ్‌తో కలిసి ఆడిపాడింది.
Image: Instagram/Urvashi Rautela
పవన్, ధరమ్‌తేజ్ కలిసి ‘బ్రో’లో నటిస్తున్నారు. సముద్రఖని దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో పబ్‌లో ఓ ప్రత్యేక గీతం చిత్రీకరించారు.
Image: Instagram/Urvashi Rautela
ఈ పాటలో గ్లామర్ కోసం చిత్రబృందం ఊర్వశి రౌతేలాను ఎంపిక చేసుకుంది. తాజాగా ఈ పాటకు సంబంధించి లిరికల్ వీడియో విడుదలైంది.
Image: Instagram/Urvashi Rautela
మరోవైపు బోయపాటి శ్రీను-రామ్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘స్కంద’లోనూ ప్రత్యేక పాటలో కనిపించబోతోంది. ఇప్పటికే ఈ పాట చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం.
Image: Instagram/Urvashi Rautela
ఇంకా.. ఊర్వశి ప్రధాన పాత్రలో తెలుగు-హిందీ ద్విభాష చిత్రం ‘బ్లాక్ రోజ్’ రూపొందింది. కానీ, వివిధ కారణాలతో విడుదల వాయిదా పడుతోంది.
Image: Instagram/Urvashi Rautela
ఈ బాలీవుడ్ భామ ‘హేట్ స్టోరీ 4’, ‘పాగల్‌పంటి’, ‘వర్జిన్ భానుప్రియ’ చిత్రాలతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నా.. ప్రత్యేక పాటలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది.
Image: Instagram/Urvashi Rautela
తెలుగుతోపాటు వివిధ భాషల్లోనూ ప్రత్యేక గీతాల్లో నటించాలంటూ ఊర్వశికి ఆఫర్స్ వస్తున్నాయి.
Image: Instagram/Urvashi Rautela