జడేజా మెచ్చిన బ్యూటీ.. ఈ అందాల రాశి!

బాలీవుడ్‌లో అత్యంత అందమైన నటి ఊర్వశి రౌతెలానట. ఈ మాట భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజానే అన్నాడు.

Image: Instagram/Urvashi Rautela

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జడేజా.. బాలీవుడ్‌లో అత్యంత అందమైన నటి ఎవరనే ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చాడు.

Image: Instagram/Urvashi Rautela

ఎప్పుడూ గ్లామరస్‌ లుక్స్‌తో కనిపించే ఊర్వశిని చూసేవారు ఎవరైనా జడేజా సమాధానంతో ఏకీభవిస్తారు.

Image: Instagram/Urvashi Rautela

తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది ఊర్వశి.

Image: Instagram/Urvashi Rautela

ఇన్‌స్టాలో తనదైన స్టైల్‌లో ఫొటోషూట్స్‌లో పాల్గొంటూ వాటిని అభిమానులతో పంచుకుంటోంది. 

Image: Instagram/Urvashi Rautela

ఊర్వశి ఇన్‌స్టా ఖాతాకు 65.9మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు తనకు ఎంత క్రేజ్‌ ఉందో..

Image: Instagram/Urvashi Rautela

ఉత్తరాఖండ్‌లో జన్మించిన ఈ సుందరి.. పదిహేనేళ్ల వయసులో ‘మిస్‌ టీన్‌ ఇండియా -2009’ టైటిల్‌ గెలుచుకుంది. ఇదే కాదు.. మరెన్నో టైటిల్స్‌ సొంతం చేసుకుంది. 

Image: Instagram/Urvashi Rautela

మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకొని ప్రముఖ ఫ్యాషన్‌ షోల్లో పాల్గొంది. అనేక షోల్లో షో స్టాపర్‌గానూ నిలిచింది. 

Image: Instagram/Urvashi Rautela

బాలీవుడ్‌లో ‘సింగ్‌ సాబ్‌ ది గ్రేట్‌(2012)’తో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. ప్రధాన పాత్రలు పోషిస్తూనే పలు సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో ఆడిపాడింది.

Image: Instagram/Urvashi Rautela

దక్షిణాదిలోనూ ‘మిస్టర్‌ ఐరావత(కన్నడ)’ ‘ది లెజెండ్‌(తమిళ్‌)’ చిత్రాల్లో హీరోయిన్‌గా మెరిసింది. పలు వెబ్‌సిరీస్‌లూ చేసింది.

Image: Instagram/Urvashi Rautela

తెలుగులో ‘వాల్తేరు వీరయ్య’లోని ‘బాస్‌ పార్టీ’లో మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి స్టెప్పులేసింది. రామ్‌ పోతినేని-బోయపాటి శ్రీను సినిమాలోనూ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది.

Image: Instagram/Urvashi Rautela

This browser does not support the video element.

యో యో హనీ సింగ్‌, మికా సింగ్‌ తదితర స్టార్‌ సింగర్ల మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లోనూ తళుక్కుమనే అందాలతో ఆకట్టుకుంది ఊర్వశి.

Image: Instagram/Urvashi Rautela

మలయాళంలో టాప్‌ 10 సినిమాలు ఇవే!

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

మీర్జాపూర్‌ గర్ల్‌.. హర్షితా గౌర్‌

Eenadu.net Home