ఊర్వశి రౌతేలా.. ఎంతో స్పెషల్..!

స్పెషల్‌ సాంగ్స్‌ల్లో అగ్ర హీరోలతో స్టెప్పులేసేందుకు సిద్ధమైందీ హీరోయిన్‌. 

Image:Instagram

చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య ’లో ఊర్వశి ఓ స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

Image:Instagram

రామ్‌పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో ఈ బ్యూటీ ప్రత్యేక గీతంలో కనిపించనున్నట్లు సమాచారం. 

Image:Instagram

మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ నటి 2013లో ‘సింగ్‌సాబ్‌ ది గ్రేట్‌’తో సినీరంగంలోకి అడుగుపెట్టింది.

Image:Instagram

ఈమె కన్నడ, హిందీ, తమిళం, తెలుగు సినిమాల్లో నటించింది.

Image:Instagram 

‘సనమ్‌ రే’, ‘గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ’, ‘వర్జిన్‌ భానుప్రియ’ సినిమాల్లో మెరిసింది.

Image:Instagram

తెలుగులో ‘నా తప్పు ఏమున్నదబ్బా’ అంటూ తన అందంతో అభిమానులను కట్టిపడేసిన ఈ భామ.. ఇప్పుడు మెగాస్టార్‌తో కలిసి స్టెప్పులేయనుంది.

Image:Instagram

ఊర్వశి రౌతేలా 1994 ఫిబ్రవరి 25న హరిద్వార్‌లో జన్మించింది.

Image:Instagram

2015లో ‘మిస్‌ దివా’లో విజేతగా నిలిచింది, ‘మిస్ యూనివర్స్’ అందాల పోటీల్లో ఈ బ్యూటీ భారత్ తరఫున పాల్గొంది. Image:Instagram

This browser does not support the video element.

ఇజ్రాయెల్ వేదికగా జరిగిన 'మిస్ యూనివర్స్ -2021' పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన అతిపిన్న వయస్కురాలిగా గుర్తింపు దక్కించుకుంది.

Image:Instagram 

This browser does not support the video element.

ఖాళీ సమయం దొరికినప్పుడల్లా షికార్ల కోసం వివిధ దేశాలకు వెళ్తుంటుంది. ఎక్కువగా బీచ్‌ ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడుతుంది. 

Image:Instagram 

ఊర్వశి రౌతేలా సోషల్‌ మీడియాలో ఎక్కువగా వివిధ అంశాలపై స్పందిస్తూ ఉంటుంది.  

Image:Instagram 


ఈమెకు ఫేస్‌బుక్‌లో 29 మిలియన్లు, ఇన్ స్టాలో 58.8 మిలియన్ల ఫాలోవర్లున్నారు.

 Image:Instagram

దేవర వీక్‌.. ఈ బ్యూటీలదే!

లవ్లీ.. లెహంగాస్‌!

జాన్వీ.. చుట్టమల్లే చుట్టేస్తాందే!

Eenadu.net Home