‘దబిడి దిబిడి’.. ఊర్వశి సందడి
ప్రత్యేక గీతాల్లో నటిస్తూ టాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గరైంది ఊర్వశీ రౌతేలా. ‘డాకు మహారాజ్’లో స్పెషల్ సాంగ్‌తో మరోసారి అలరించింది.
‘దబిడి దిబిడి..’ అనే పాటలో బాలకృష్ణ సరసన అదిరే స్టెప్పులేసింది. ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది.
2013లో ‘సింగ్ సాబ్ ది గ్రేట్’తో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’, ‘హేట్‌స్టోరీ 4’, ‘సనమ్ రే’ వంటి చిత్రాల్లోనూ నటించింది.
15 ఏళ్లకే మోడలింగ్ మొదలు పెట్టిన ఊర్వశీ 2015 లో ‘మిస్ యూనివర్స్ ఇండియా’ టైటిల్‌ను గెలుచుకుంది.
హరిద్వార్‌లో పుట్టి పెరిగిన ఊర్వశి.. స్థానిక పాఠశాలలో స్కూల్ విద్యను, దిల్లీలో గార్గి కళాశాలలో కాలేజీ చదువును పూర్తి చేసింది.
2011లో ‘మిస్ టూరిజం క్వీన్ ఆఫ్ ది ఇయర్’, ‘మిస్ ఏషియన్ సూపర్ మోడల్’ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది.
2018లో ‘మోస్ట్ యంగెస్ట్ బ్యూటీఫుల్ ఉమెన్’గా ‘మహారత్న’ అవార్డును అందుకుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఊర్వశి క్యూట్ ఫొటోలతో ఇన్‌స్టాలో సందడి చేస్తుంటుంది. తన ఇన్‌స్టాలో 7 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
‘సినిమాల్లోకి రాకపోతే ఏరోనాటికల్ ఇంజినీర్, లేదా ఐఏఎస్ అధికారి అయ్యేదాన్ని’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
‘వాల్తేరు వీరయ్య’, ‘స్కంద’, ‘ఏజెంట్’, ‘బ్రో’ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌తో ప్రేక్షకుల్ని అలరించింది.
‘బ్లాక్ రోజ్’, ‘వెల్‌కమ్ టు ది జంగిల్’, ‘కసోర్ 2’ వంటి చిత్రాలతో వివిధ భాషల్లో బిజీ బిజీగా ఉంది.