ఎయిర్‌ఫోర్స్‌ అధికారిణికి అందాల కిరీటం

అగ్రరాజ్యం అమెరికాలో అందాల పోటీలు జరిగాయి. ఈ ఏడాది ‘మిస్‌ అమెరికా 2024’ కిరీటాన్ని 22 ఏళ్ల మ్యాడిసన్‌ మార్ష్‌ దక్కించుకున్నారు.

ఈమె అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న అధికారిణి కావడం విశేషం.

వాయుసేన విధుల్లో ఉన్న ఓ అధికారిణి ఇలా అందాల సుందరి టైటిల్‌ను దక్కించుకోవడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి.

ఫ్లోరిడాలోని ఓర్లాండోలో ఈ పోటీలు జరిగాయి. ఇందులో మొత్తం 51 మంది పోటీ చేశారు.

గతేడాది మే నెలలో ఈమె మిస్‌ కొలరాడోగా కిరీటం దక్కించుకున్నారు.

2023లో ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ నుంచి ఫిజిక్స్‌లో డిగ్రీ పట్టా పొందిన మార్ష్‌.. వాయుసేనలో సెకండ్‌ లెఫ్టినెంట్‌గా చేరారు.

ఓవైపు విధులు నిర్వర్తిస్తూనే హర్వర్డ్‌ కెనడీ స్కూల్‌ నుంచి మాస్టర్స్‌ చేస్తున్నారు.

This browser does not support the video element.

అదే సమయంలో అందాల పోటీల్లో పాల్గొని కిరీటం దక్కించుకున్నారు.

ఆఫీసులో ఎక్సర్‌సైజ్‌.. అదెలా సాధ్యం!

మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రైల్వే సౌకర్యాలు ఏంటో చూడండి..

వీటితో సహజంగా చుండ్రుకి చెక్‌!

Eenadu.net Home