రాజమౌళితో ఫొటో.. ఆంధ్రా మీల్స్‌.. ఉండాల్సిందే!

‘హుషారు’తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ప్రియా వడ్లమాని త్వరలో ‘బ్రహ్మా ఆనందం’తో అలరించనుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది.

బ్రహ్మానందం అతని కుమారుడు రాజా గౌతమ్‌ కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్వీఎస్‌ నిఖిల్‌ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రియ ఓ నాయిక.

మధ్య ప్రదేశ్‌లో పుట్టిన ఈమెది కోస్తాంధ్ర.. హైదరాబాద్‌లో పెరిగింది. బెంగళూరులో డిగ్రీ పూర్తి చేసింది.

2016లో మోడలింగ్‌, ఆ తర్వాత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

2018లో ‘ప్రేమకు రెయిన్‌చెక్‌’తో మొదటి సారిగా తెరపై మెరిసింది. ఆ ఏడాదే విడుదలైన ‘హుషారు’తో ‘ఉండిపోరాదే..’ అంటూ గుర్తింపు తెచ్చుకుంది.

‘శుభలేఖలు’, ‘ఆవిరి’, ‘కాలేజ్‌ కుమార్’, ‘ముఖచిత్రం’, ‘మను చరిత్ర’, ‘ఓం భీమ్‌ బుష్‌’, ‘వీరాంజనేయులు విహారయాత్ర’ చిత్రాలతో అలరించింది.

‘డ్యాన్స్‌ అంటే ఇష్టం. కానీ చేయడం రాదు. అతికష్టం మీద స్టెప్పులు గుర్తుపెట్టుకొని కవర్‌ చేస్తా’ అంటోంది ప్రియ.

రాజమౌళి డైరెక్షన్‌ స్కిల్స్‌కి ప్రియ పెద్ద ఫ్యాన్‌. ఆయన్ని కలిసినప్పుడల్లా ఓ ఫొటో తీసుకోవాల్సిందే అని చెప్పింది.  

తెలుగు వారి సంప్రదాయాలను పాటిస్తూ పండుగలు చేసుకోవడం నచ్చుతుంది. ఆయా రోజుల్లో పట్టు వస్త్రాల్లో సందడి చేస్తుంది.

ఆంధ్రా భోజనం అంటే ఇష్టం. షూటింగ్‌లో ఎక్కడ ఉన్నా వీలైతే ఆంధ్రా మీల్స్‌నే తెప్పించుకొని తింటుంది.

మూగజీవాలంటే అభిమానం. అనారోగ్యంతో ఉన్న శునకాలను దత్తత తీసుకొని వాటి బాగోగులు చూసుకుంటుంది.

‘కనుసైగలతోనే వలచింది..’ ఈమెనే!

మోడలింగ్‌ కోసం డిగ్రీ వదిలేశా

‘దిల్‌రూబా’తో సందడి చేయనున్న రుక్సార్‌

Eenadu.net Home