ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత తెలుసా?

ముక్కోటి ఏకాదశి రోజున మహా విష్ణువు మూడు కోట్ల మంది దేవతలతో గరుడ వాహనంపై భూలోకానికి వస్తాడని చెబుతారు.

image:RKC

అందుకే ఈ ఏకాదశిని ముక్కోటిగా పిలుస్తారు. తెల్లవారుజామునే వైకుంఠ ద్వార దర్శనంలో మహా విష్ణువును దర్శించుకుంటారు.

image:RKC

ఈ ఏడాది తిరుమలతో పాటు వైష్ణవాలయాల్లో మహా విష్ణువుకు ప్రత్యేక పూజ కార్యక్రమాలుంటాయి. తిరుమలలో ఈసారి భక్తుల సౌకర్యార్థం ఈ నెల 2 నుంచి 10 రోజులు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. 

image:RKC

వైకుంఠ ద్వార దర్శనంతో జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. పుణ్యలోకం ప్రాప్తిస్తుందని భక్తులు నమ్ముతారు.

image:RKC

ముక్కోటి నాడే హాలాహలం, అమృతం ఉద్భవించాయని పండితులు చెబుతారు. 

image:RKC

వైకుంఠ ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే ఈ రోజున బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదని అంటారు.

image:RKC

ముక్కోటి రోజు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీంతో అనుకున్న కార్యాలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.

image:RKC

చిన్ననాటి నుంచే ఏకాదశి ఉపవాస వ్రతం చేస్తే 70ఏళ్లయినా ఆరోగ్యంతో ఉంటారని ప్రతీతి. 

image:RKC

ఏకాదశి రోజు ఉపవాసం, జాగరణ, ప్రత్యేక పూజలు చేయడంతో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

image:RKC

దేశ వ్యాప్తంగా 355 వైష్ణవ దేవాలయాల్లో ఒకేసారి, ఒకే సమయంలో పూజా కార్యక్రమాలు జరగడం విశేషమని చెప్పొచ్చు.

image:RKC

వ్యక్తిత్వ వికాసానికి గురునానక్‌ సూక్తులు

చాణక్య చెప్పిన నీతి వాక్యాలు

భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ హిందూ ఆలయాలున్నాయి..!

Eenadu.net Home