ఆంధ్రా అమ్మాయే.. వైశాలి రాజ్‌

‘కనబడుటలేదు’ అంటూ తెలుగు తెరపై అడుగుపెట్టింది వైశాలి రాజ్‌. ప్రస్తుతం ‘జితేందర్‌ రెడ్డి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

నవంబర్‌ 8న విడుదల అయ్యిందీ చిత్రం. దీనికి విరించి వర్మ దర్శకుడు. ఈ సినిమాలో మరో నాయిక రియా సుమన్‌.

పుట్టి పెరిగింది వైజాగ్‌లో డిగ్రీ పూర్తి చేశాక నటన మీద ఆసక్తితో తొలుత మోడలింగ్‌తో కెరీర్‌ మొదలుపెట్టింది.

‘ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌’, ‘కనబడుట లేదు’, వంటి చిత్రాలతో అలరించింది. ఈ ఏడాది ‘మస్త్‌ షేడ్స్‌ ఉన్నయ్‌రా’, ‘ఫస్ట్‌ లవ్‌’ విడుదల అయ్యాయి. 

వైశాలి అందం, అభినయంతో రాఘవ లారెన్స్‌ ‘బుల్లెట్‌’లో ఛాన్స్‌ కొట్టేసింది. ఈ సినిమా వచ్చే జనవరిలో విడుదల కానుంది.  

‘మీ జీవితానికి మీరే ఆర్టిస్టు.. ఆ కుంచెను ఎవరి చేతికీ ఆప్పగించొద్దు. మీ కంట్రోల్‌లోనే ఉంచుకోండి’ అంటూ ఈతరం అమ్మాయిలకు చెబుతూ ఉంటుంది.

బీచ్‌లో ఆడుకోవడం ఇష్టం. ‘బీచ్‌ పిలుస్తుంది నేను వెళ్లాల్సిందే..’ అంటూ సమయం తెలియకుండా సముద్ర తీరాన అల్లరి చేస్తుంది.

స్నేహితులతో కలసి ట్రిప్‌లకి వెళ్లి అక్కడి ఆహారాన్ని ఆస్వాదించడం నచ్చుతుంది వైశాలికి.

ఫిట్‌నెస్‌ కోసం యోగా చేస్తుంది. గంటల తరబడి స్విమ్‌ చేసినా బోర్‌ కొట్టదట. నాజూగ్గా ఉండేందుకు ఇదీ ఒక కారణమే అంటోంది. 

ఖాళీ సమయాల్లో రీల్స్‌ చేస్తుంది. పవన్‌ కల్యాణ్‌ని ఇమిటేట్‌ చేస్తూ.. ఇన్‌స్టాలో షేర్‌ చేసిన వీడియో వైరల్‌ అయ్యింది. తన పేరిట యూట్యూబ్‌ ఛానల్‌నూ నడిపిస్తోంది వైశాలి.  

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home