భలే జోడీ... ‘జాక్‌’తో ‘బేబీ’

‘బేబీ’తో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైన వైష్ణవి చైతన్య.. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్‌’తో పలకరించనుంది.

బొమ్మరిల్లు భాస్కర్‌ రూపొందిస్తున్న ఈ సినిమాకు ‘కొంచెం క్రాక్’ అనేది ఉపశీర్షిక. ఏప్రిల్‌ 10న సినిమా విడుదల కానుంది.

వైష్ణవి పుట్టింది విజయవాడ, పెరిగింది హైదరాబాద్‌.. స్కూలు, కాలేజీ విద్య భాగ్యనగరంలోనే. డబ్‌స్మాష్‌, టిక్‌టాక్‌ వీడియోలతో గుర్తింపు తెచ్చుకుంది.

2016లో యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టి.. కవర్‌ వీడియోలు చేసేది. అవే షార్ట్ ఫిల్మ్‌లో నటించే అవకాశాన్ని తెచ్చిపెట్టాయి.

‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’, ‘అరే అరే మనసా’, ‘మిస్సమ్మ’, ‘లవ్‌ ఇన్‌ 143 అవర్స్‌’లో తన లుక్స్‌, నటనతో యూత్‌ క్రష్‌గా మారింది.

‘టచ్‌ చేసి చూడు’తో మొదటిసారి వెండితెరపై కనిపించిన వైష్ణవీ, ‘అల.. వైకుంఠపురములో..’ ‘రంగ్‌దే’, ‘టక్‌ జగదీశ్‌’, ‘వరుడు కావలెను’, ‘వలిమై’, ‘ప్రేమదేశం’లో నటించింది.

సంప్రదాయ దుస్తులను ఇష్టపడే వైష్ణవి చీరలను ఎక్కువగా ధరిస్తుంది. ఆమె ఇన్‌స్టాలో ఇలాంటి ఫొటోలు, రీల్సే ఎక్కువ.

‘చిన్నతనంలో వినాయక చవితికి గణేశుని విగ్రహాల ముందు తీన్‌మార్ ఆడేది. అది ‘బేబీ’ సినిమాకు బాగా పనికొచ్చిందని చెప్పింది.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home