హీరోయిన్‌గా యూట్యూబ్‌ బ్యూటీ.. వైష్ణవి చైతన్య

యూట్యూబ్‌.. సోషల్‌ మీడియాతో ఫేమ్‌ సంపాదించుకొని, సినిమాల్లో సహాయక పాత్రలతో మెప్పించిన వైష్ణవి చైతన్య.. ఇప్పుడు హీరోయిన్‌గా మారింది.

Image:Instagram/vaishnavi_chaitanya_ 

ఆనంద్ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌ హీరోలుగా తెరకెక్కిన ‘బేబీ’లో హీరోయిన్‌గా నటించింది. ఇందులో తనది డీగ్లామర్‌ పాత్ర. ఈ సినిమాకు సాయి రాజేశ్‌ దర్శకత్వం వహించారు.

Image:Instagram/vaishnavi_chaitanya_ 

ఈ భామ.. 1994 జనవరి 4న విజయవాడలో జన్మించింది. చదువుకుంటూనే నటన మీద ఆసక్తితో షార్ట్‌ ఫిలిమ్స్‌ చేసేది.

Image:Instagram/vaishnavi_chaitanya_

మొదట డబ్‌ స్మాష్‌ వీడియోలు చేసిన వైష్ణవి.. తర్వాత టిక్‌ టాక్‌, ఇన్‌స్టాలో తన వీడియోలు పోస్టు చేస్తూ ఫేమస్‌ అయింది. 

Image:Instagram/vaishnavi_chaitanya_

యూట్యూబ్‌లో ‘క్షణం ఒక యుగమే’తో షార్ట్‌ ఫిలిమ్స్‌ చేయడం మొదలుపెట్టింది వైష్ణవి. నటుడు షణ్ముఖ్‌తో చేసిన ‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ వెబ్‌సిరీస్‌ ఈమెకు మరింత క్రేజ్‌ తెచ్చిపెట్టింది.

Image:Instagram/vaishnavi_chaitanya_

తన అందం, అభినయంతో నెటిజన్లను ఆకట్టుకుంది. తనకంటూ అభిమానుల్ని సంపాదించుకుంది. దీంతో ఈమెకు సినిమా అవకాశాలు వస్తున్నాయి.  

Image:Instagram/vaishnavi_chaitanya_

సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వైష్ణవి మంచి పేరు తెచ్చుకొంది. అల్లు అర్జున్, నాని, రవితేజ వంటి స్టార్‌ హీరోల సినిమాల్లో నటించింది. 

Image:Instagram/vaishnavi_chaitanya_

ఇప్పుడు ‘బేబీ’తో కథానాయికగా కనిపించబోతోంది. ఈ సినిమా విడుదలకు ముందే మరో మూడు సినిమాల్లో హీరోయిన్‌గా నటించేందుకు అవకాశాలు వచ్చినట్టు సమాచారం.

Image:Instagram/vaishnavi_chaitanya_

This browser does not support the video element.

కళ్లతోనే భావాలు పలికించే వైష్ణవి. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుంటుంది.

Image:Instagram/vaishnavi_chaitanya_

వైష్ణవి.. పెట్ లవర్‌. తన పెంపుడు కుక్క.. అల్ఫాతో ఎక్కువ సమయం గడుపుతుంటుందట. తనకు డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టమని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. 

Image:Instagram/vaishnavi_chaitanya_

రిద్ది.. ప్రభాస్‌తో అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా!

కృతి సనన్.. గ్లామర్‌ అదిరెన్‌..!

బిహారీ భామ.. ఐశ్వర్యా సుస్మిత

Eenadu.net Home