మిస్టరీ స్పిన్నర్‌..

రికార్డు హంటర్‌

దక్షిణాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌ చివరి వరకూ పోరాడి ఓడింది. అయితే ఐదు వికెట్లతో వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో అదరగొట్టాడు. రికార్డులూ సాధించాడు. 

ఫామ్‌ కోల్పోయి కొన్నేళ్ల క్రితం జాతీయ జట్టుకు దూరమైన మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఇటీవల బంగ్లాదేశ్‌ సిరీస్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు.

బంగ్లా సిరీస్‌లో 5 వికెట్లతో అదరగొట్టగా.. ఇప్పుడు సౌతాఫ్రికా సిరీస్‌లో కూడా రాణిస్తున్నాడు. రెండు మ్యాచుల్లో మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. 

టీ20ల్లో భారత్‌ తరఫున 5 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన అతిపెద్ద వయస్కుడిగా వరుణ్ చక్రవర్తి (33 ఏళ్ల 73 రోజులు) నిలిచాడు. అంతకుముందు భువనేశ్వర్ కుమార్ (32 ఏళ్ల 215 రోజులు) పేరిట ఈ రికార్డు ఉండేది.

టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన భారత స్పిన్నర్‌గా కుల్‌దీప్‌ యాదవ్‌ (5/17)తో కలిసి వరుణ్‌ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. వీరిద్దరితోపాటు చాహల్‌ కూడా 5 వికెట్లు తీశాడు.

టీ20ల్లో ఐదు కంటే ఎక్కువ వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్‌ వరుణ్‌. ఈ ఘనతను ఇప్పటివరకు కుల్‌దీప్‌, యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, భువనేశ్వర్‌ సాధించారు.

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ.. ఏ మ్యాచ్‌, ఎప్పుడు, ఎక్కడ?

ఆప్టస్ స్టేడియం విశేషాలు.. ఆధిపత్యం ఏ ఆటగాడిది?

BGT పోరు.. ఈ 10 విషయాలు తెలుసా?

Eenadu.net Home