హ్యాపీ బర్త్ డే ‘కింగ్’ కోహ్లీ
తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు బద్దలుకొట్టిన ‘కింగ్ కోహ్లీ’ 34వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా పరుగుల వీరుడు నెలకొల్పిన పలు రికార్డులపై ఓ లుక్కేద్దాం.
Image:RKC
వన్డేల్లో ఎక్కువ సెంచరీలు (43) బాదిన రెండో క్రికెటర్. సచిన్ (49) శతకాలతో మొదటి స్థానంలో ఉన్నాడు.
Image:RKC
వన్డేల్లో ఇప్పటివరకు 12,344 పరుగులు చేసి ఈ ఫార్మాట్‌లో ఎక్కువ పరుగులు చేసిన రెండో భారత క్రికెటర్‌గా కొనసాగతున్నాడు.
Image:RKC
50 ఓవర్ల క్రికెట్‌లో ఒక జట్టుపై (వెస్టిండీస్‌పై) అత్యధిక సెంచరీలు ( 9 శతకాలు 41 ఇన్నింగ్స్‌ల్లో) బాది ఈ జాబితాలో సచిన్‌తో (9 సెంచరీలు ఆస్ట్రేలియాపై 71 ఇన్నింగ్స్‌ల్లో) కలిసి తొలి స్థానంలో నిలిచాడు.
Image:RKC
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు (3932) చేసిన రికార్డు కోహ్లీ పేరిట ఉంది. ఈ ఫార్మాట్‌లో ఎక్కువసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ (7), ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (15) అవార్డు అందుకున్న క్రికెటర్.
Image:RKC
అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువసార్లు (37) 50+ స్కోర్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇందులో ఒక సెంచరీ, 36 అర్ధశతకాలున్నాయి.
Image:Twitter
టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు(1,065)
Image:Twitter
కోహ్లీ కెప్టెన్సీ రికార్డులు ఇలా..
68 టెస్టులు.. 40 విజయాలు,17 ఓటములు, డ్రా 11.
95 వన్డేలు.. 65 విజయాలు, 27 ఓటములు, టై/ ఫలితం తేలనివి 3. టీ20లు 50 .. 30 విజయాలు, 16 ఓటములు,టై/ ఫలితం తేలనివి 4.
Image:RKC
కోహ్లీ మూడు ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 24,350 పరుగులు చేయగా.. 2,419 ఫోర్లు, 265 సిక్స్‌లు బాదాడు.
Image:RKC
మైదానంలో చిరుతగాలాగే కదిలే కోహ్లీ టెస్టుల్లో 102, వన్డేల్లో 138, టీ20ల్లో 49 క్యాచ్‌లు అందుకున్నాడు.
Image:RKC
విరాట్ ఇప్పటివరకు 102 టెస్టులు ఆడి 8,074 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు,28 అర్ధ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 254 నాటౌట్.
Image:RKC