విరాట్ కోహ్లీ అరంగేట్రానికి 14 ఏళ్లు..

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి సరిగ్గా నేటితో 14 ఏళ్లు అవుతోంది.

image:Instagram/Virat Kohli 

2008 ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేశాడు. తర్వాత జట్టులో కీలక ఆటగాడిగా మారి ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

image:Instagram/Virat Kohli

అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు మొత్తం 23,726 పరుగులు చేశాడు. ఇందులో 70 సెంచరీలు, 122 హాఫ్ సెంచరీలున్నాయి.

image:Eenadu

262 వన్డేలు ఆడి 12,344 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో అతడి అత్యధిక స్కోరు 183 కాగా.. 43 సెంచరీలు, 64 అర్ధ సెంచరీలున్నాయి. image:Instagram/Virat Kohli

వన్డేల్లో వేగంగా 12 వేల పరుగులు పూర్తిచేసుకున్న తొలి ఆటగాడు విరాటే. 242 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత అందుకున్నాడు.

image:Eenadu 

ఇప్పటివరకు 99 అంతర్జాతీయ టీ20ల్లో 3,308 రన్స్‌ చేశాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

image:Eenadu

అన్ని ఫార్మాట్లలో కలిపి 57 సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది అవార్డు, 19 సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు.

image:Eenadu

అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువసార్లు (7) ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకుంది విరాట్‌ కోహ్లీయే.

image:Eenadu

టీమ్‌ఇండియా తరఫున ఇప్పటివరకు 242 సిక్స్‌లు, 2,368 ఫోర్లు బాది 284 క్యాచ్‌లు అందుకున్నాడు.

image:Eenadu

క్రీడారంగంలో తను చేసిన సేవలకుగాను కోహ్లీని భారత ప్రభుత్వం 2013లో అర్జున అవార్డు, 2017లో పద్మ శ్రీ, క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్ రత్న అవార్డు’(2018)తో సత్కరించింది.

image:Eenadu

IND vs BAN.. ఎప్పుడు, ఎక్కడ, ఎందులో?

సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాతో భారత్‌ టెస్ట్‌ సిరీస్‌!

దులీప్‌ ట్రోఫీ.. బౌలింగ్‌తో దుమ్ముదులిపేశారు!

Eenadu.net Home