ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌.. విరాట్‌ను ఊరిస్తున్న రికార్డులు

ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ జనవరి 25 నుంచి ప్రారంభం కానుంది. స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతలకు చేరువగా ఉన్నాడు.

విరాట్ మరో 152 పరుగులు చేస్తే టెస్టుల్లో 9 వేల పరుగులను చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. సచిన్, ద్రవిడ్, సునీల్ గావస్కర్ మాత్రమే కోహ్లీ కంటే ముందున్నారు.

తొమ్మిది ఫోర్లు బాదితే టెస్టుల్లో 1000 ఫోర్లు కొట్టిన బ్యాటర్‌గా నిలుస్తాడు. భారత్‌ నుంచి సచిన్, ద్రవిడ్, సెహ్వాగ్, లక్ష్మణ్‌, సునీల్ గావస్కర్ 1000+ ఫోర్లు కొట్టారు.

విరాట్ మరో 9 రన్స్‌ చేస్తే ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో 2 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా అవతరిస్తాడు. సచిన్, గావస్కర్‌ ఈ ఘనతను సాధించారు. ఇంగ్లాండ్‌పై కోహ్లీ 1,991 పరుగులు చేశాడు. 

ఇంగ్లాండ్‌పై మరో 52 పరుగులు చేస్తే టెస్టుల్లో ఒక జట్టుపై తాను చేసిన అత్యధిక పరుగుల రికార్డును తిరగరాస్తాడు. ఆసీస్‌పై 2,042 చేసిన విరాట్.. ఇప్పుడు దానిని అధిగమిస్తాడు.

విరాట్ 16 పరుగులు రాబడితే.. కెప్టెన్‌గా లేకుండా టెస్టుల్లో 3000 పరుగులు చేసిన బ్యాటర్‌గా మారతాడు. ప్రస్తుతం కోహ్లీ 45 టెస్టుల్లో 2,984 రన్స్‌తో కొనసాగుతున్నాడు.

విరాట్ మూడు సెంచరీలు చేస్తే.. ఇంగ్లాండ్‌పై అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్‌గా అవతరిస్తాడు. ప్రస్తుతం కోహ్లీ ఐదు సెంచరీలు చేశాడు. సచిన్, గావస్కర్‌ చెరో ఏడుతో అగ్రస్థానంలో ఉన్నారు.

టెస్టుల్లో విరాట్ మొత్తం 29 సెంచరీలు సాధించాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో మరో నాలుగు చేస్తే ప్రస్తుతం ఆడుతున్నవారిలో టాపర్‌గా నిలుస్తాడు. స్టీవ్‌స్మిత్ (32) కోహ్లీ కంటే ముందున్నాడు.

టెస్టుల్లో రాహుల్‌ ద్రవిడ్ తర్వాత అత్యధిక క్యాచ్‌లు పట్టింది వీరే!

ఒకే ఇన్నింగ్స్‌లో ఏడు క్యాచ్‌లు పట్టిన వారి జాబితా ఇదే!

పారాలింపిక్స్‌.. చరిత్రలో ‘ఫస్ట్’ పతక వీరులు

Eenadu.net Home