WTC.. కోహ్లీ ఈ రికార్డులు బద్దలు కొట్టేనా?

మరికొన్ని గంటల్లో ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ పోరు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో రన్నింగ్‌ మెషిన్‌ విరాట్‌ కోహ్లీ కొన్ని రికార్డులు బద్దలుకొట్టే అవకాశాలున్నాయి. అవేంటో చూద్దాం..

Image: Twiter/Bcci

ఐసీసీ నాకౌట్‌ స్టేజ్‌ (సెమీ ఫైనల్స్‌, ఫైనల్స్‌) మ్యాచుల్లో ఇప్పటి వరకు కోహ్లీ 15 మ్యాచ్‌లు ఆడి 620 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ రాణిస్తే.. సచిన్‌ (657 పరుగులు), రికీపాంటింగ్‌ (731 పరుగులు) రికార్డులను దాటేయొచ్చు. 

Image: RKC

మరో 21 పరుగులు చేస్తే ఆస్ట్రేలియాతో టెస్టుల్లో కోహ్లీ 2వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. 164 పరుగులు సాధిస్తే ఆసీస్‌పై అత్యధిక పరుగులు సాధించిన రాహుల్‌ ద్రవిడ్‌ (2,143)రికార్డు బద్ధలుకొట్టొచ్చు. 

Image: RKC

ఇప్పటి వరకు కోహ్లీ 108 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 8,416 పరుగులు చేశాడు. మరో 125 పరుగులు చేస్తే వెస్టిండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ సర్‌ వివియన్ రిచర్డ్స్‌ (8,540) రికార్డు దాటేస్తాడు.

Image: RKC

ఒక్క నాథన్‌ లైయన్‌ బౌలింగ్‌లోనే ఛెతేశ్వర్‌ పుజారా 570 పరుగులు సాధించాడు. అదే బౌలర్‌పై కోహ్లీ 511 పరుగుల వద్ద ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో పుజారా రికార్డును కోహ్లీ బద్దలుకొట్టే ఛాన్స్‌ ఉంది. 

Image: RKC

ఇంగ్లాండ్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లలో రాహుల్‌ ద్రవిడ్‌ (2,645) తొలిస్థానంలో ఉన్నాడు. కోహ్లీ 2,574 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌తో టాప్‌లోకి రావొచ్చు.

Image: RKC

అన్ని ఫార్మాట్లు కలిపి ఆస్ట్రేలియాపై ఇప్పటివరకు కోహ్లీ 4,945 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మరో 55 పరుగులు సాధిస్తే 5 వేల పరుగులు మైలురాయిని అందుకుంటాడు. 

Image: RKC

SENA (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత క్రికెటర్ సచిన్‌ (22). రెండో స్థానం (21)లో ఉన్న విరాట్‌ ఈ రికార్డును సమం లేదా అధిగమించే ఛాన్స్‌ ఉంది. 

Image: RKC

సౌరభ్‌ గంగూలీ.. ఐసీసీ ఛాంపియన్‌ ట్రోఫీ (2000) ఫైనల్‌లో శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేస్తే 23 ఏళ్ల తర్వాత ఆ ఘనత సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు.

Image: RKC

అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కోహ్లీ ఇప్పటివరకు 75 సెంచరీలు చేశాడు. ఈ మ్యాచ్‌లో మరో శతకం సాధిస్తే.. అత్యంత వేగంగా (555 మ్యాచ్‌లు) 76 శతకాలు సాధించిన క్రికెటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్‌ (587)కు ఉంది.

Image: RKC

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home