‘వీరూ’డి రికార్డులు తెలుసా? 

తన విధ్వంసకర ఆటతీరుతో భారత జట్టుకు ఎన్నో విజయాలనందించాడు మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌. నేడు సెహ్వాగ్‌ 44వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా క్రికెట్‌లో వీరూ నెలకొల్పిన రికార్డులపై ఓ లుక్కేద్దాం.

Image:RKC

సెహ్వాగ్‌ ఏప్రిల్‌ 01, 1999న పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 2001 నవంబర్‌లో సౌతాఫ్రికాపై తన తొలి టెస్టు మ్యాచ్‌ని ఆడాడు.

Image:RKC

టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌. ఈ ఫార్మాట్‌లో రెండు సార్లు ట్రిపుల్‌ సెంచరీ చేసిన ఏకైక భారత ఆటగాడు.

Image:RKC

వన్డేల్లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు (219) చేసిన తొలి క్రికెటర్‌. 2011లో వెస్టిండీస్‌పై వీరూ డబుల్‌ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.

Image:RKC 

టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు (47) కొట్టిన రెండో ఆటగాడు సెహ్వాగ్‌.ఇంగ్లాండ్‌ మాజీ ప్లేయర్‌ జాన్ హ్యూ ఎడ్రిచ్ (52) మొదటి స్థానంలో ఉన్నాడు.

Image:RKC

సెహ్వాగ్‌ తన అంతర్జాతీయ కెరీర్‌లో 31 సార్లు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

Image:RKC

టెస్టుల్లో ఒకే రోజు అత్యధిక పరుగులు (284) చేసిన మూడో క్రికెటర్‌. బ్రాడ్‌మాన్‌ (309), వాలీ హమ్మండ్ (295) సెహ్వాగ్‌ కంటే ముందున్నారు.

Image:RKC

అంతర్జాతీయ క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌ 11 సార్లు 90ల్లో ఔటయ్యాడు.

Image:RKC 

సుదీర్ఘ ఫార్మాట్‌లో వేగవంతంగా 7,000 పరుగులు పూర్తి చేసిన మూడో క్రికెటర్‌. 134 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకున్నాడు.

Image:RKC

వీరూ టెస్టుల్లో 23 శతకాలు, 32 అర్ధ శతకాలు, వన్డేల్లో 15 సెంచరీలు, 38 హాఫ్‌ సెంచరీలు, టీ20ల్లో 2 హాఫ్‌ సెంచరీలు బాదాడు.

Image:RKC

అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 374 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 8,273, టెస్టుల్లో 8,586, టీ20ల్లో 394 పరుగులు చేశాడు.

Image:RKC

సెహ్వాగ్‌ మంచి బౌలర్‌ కూడా. టెస్టుల్లో 40, వన్డేల్లో 96 వికెట్లు పడగొట్టాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 2,408 ఫోర్లు, 243 సిక్సర్లు బాదాడు.

Image:RKC

IND vs BAN.. ఎప్పుడు, ఎక్కడ, ఎందులో?

సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాతో భారత్‌ టెస్ట్‌ సిరీస్‌!

దులీప్‌ ట్రోఫీ.. బౌలింగ్‌తో దుమ్ముదులిపేశారు!

Eenadu.net Home