విటమిన్‌ డి లోపమా..ఇవి తినండి

రోజుకు రెండు వెల్లుల్లి రెబ్బలు లేదా నాలుగు లవంగాలను పరగడుపున లేదా రాత్రి భోజనం తర్వాత తీసుకోవాలి.

image:Pixabay

వారానికోసారి పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో విటమిన్‌ డి స్థాయులు నిలకడగా ఉంటాయి.

image:Pixabay 

 రాగి రోటీ, ఆవాలు, పసుపులను ఆహారంలో చేర్చుకున్నా ఫలితం ఉంటుంది.

image:Pixabay

రోజూ చిన్న ముక్క డార్క్‌ చాక్లెట్‌ను తీసుకోవాలి. కొత్తిమీర, ఆరెంజ్‌, యోగర్ట్‌, చీజ్‌లనూ ఎంచుకోవచ్చు. ఇవి ఇమ్యూనిటీని పెంచడానికీ సాయపడతాయి.

image:Pixabay

రోజుకు ఒక గ్లాసు వెన్నతో కూడిన ఆవు పాలు తాగడం వల్ల రోజులో కావాల్సిన మొత్తంలో 20 శాతం దాకా విటమిన్‌ డి ని శరీరానికి అందించవచ్చు.

image:Pixabay

కమలాఫలంలో విటమిన్ సి, డిలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇమ్యూనిటీని పెంచడానికి దోహదం చేస్తాయి.

image:Pixabay

గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ డి తో పాటు ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి.

image:Pixabay

చేపల్లోనూ విటమిన్ డి స్థాయులు ఎక్కువే. అలాగే ఇందులో ఉండే క్యాల్షియం, ప్రొటీన్లు, ఫాస్ఫరస్‌.. వంటి పోషకాలు సంపూర్ణ ఆరోగ్యానికి సహకరిస్తాయి.

image:Pixabay


రోజూ కాసేపు చర్మానికి ఎండ తగిలేలా చూసుకుంటే విటమిన్‌ డి లోపం తలెత్తకుండా ఉంటుంది. image:Pixabay

మరీ అవసరమైతే ట్యాబ్లెట్ల రూపంలో విటమిన్‌ డి తీసుకోవచ్చు. దీనికి వైద్యుల సలహాను తీసుకోవడం తప్పనిసరి.

image:Pixabay


వస్తున్నారు సోలోగా.. వినోదమిస్తారు థ్రిల్లింగ్‌గా..

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

అత్యంత ఖరీదైన భారతీయ చిత్రాలివే!

Eenadu.net Home