వివో ₹1.60 లక్షల ఫోన్ విశేషాలివీ..

This browser does not support the video element.

ఎక్స్‌ ఫోల్డ్‌ 3 ప్రో పేరుతో వివో కొత్త ఫోల్డబుల్‌ ఫోన్‌ను భారత్‌లో జూన్‌ 6న లాంచ్‌ చేసింది. 

స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌తో వస్తోంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్ 14తో పనిచేస్తుంది

8.3 అంగుళాల లోపలి డిస్‌ప్లే 2కె+ రిజల్యూషన్‌, డాల్బీ విజన్‌, హెచ్‌డీఆర్‌10 సపోర్ట్‌తో వస్తోంది. కవర్‌ డిస్‌ప్లే పరిమాణం 6.53 అంగుళాలు.

హింజ్‌ను కార్బన్‌ ఫైబర్‌తో తయారు చేయడంతో రోజుకు 100 సార్లు మడతబెట్టినా 12 ఏళ్ల పాటు సమర్థంగా పనిచేయగలదని వివో చెబుతోంది.

ఇందులో ఓఐఎస్‌, 64MP టెలిఫొటో సెన్సర్‌, 50MP అల్ట్రావైడ్‌ సెన్సర్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా ఇచ్చారు. సెల్ఫీ కోసం కవర్‌ స్క్రీన్‌పై 32MP కెమెరా ఉంది.

120Hz రీఫ్రెష్‌ రేటు, 4,500నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. వివో వి3 ఇమేజింగ్‌ చిప్‌ కూడా ఉంది.

100W వైర్డ్‌, 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,700mAh బ్యాటరీని ఇచ్చారు.

సింగిల్‌ వేరియంట్‌లో సెలెస్టియల్‌ బ్లాక్‌ రంగులో ఈ ఫోన్‌ లభిస్తోంది. 16జీబీ + 512జీబీ స్టోరేజ్‌ ధర రూ.1,60,000. 

వివో ఇండియా, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీబుకింగ్‌కు అందుబాటులో ఉంది. జూన్‌ 13 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

సామాజిక మాధ్యమాలను సానుకూలంగానూ ఉపయోగించొచ్చు..

లింక్డిన్‌ ప్రొఫైల్‌ ఆకర్షణీయంగా రూపొందించాలా?

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా?

Eenadu.net Home