Vivo X90 మొబైల్స్ రెడీ.. ఫీచర్లివేనా?
వివో నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్స్ సిద్ధమయ్యాయి. X సిరీస్‌లో X90 మొబైల్స్ త్వరలో లాంచ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఫీచర్లివే అంటూ కొన్ని వివరాలు అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నాయి.
Image:Vivo(నమూనా చిత్రం)
ఎక్స్90ప్రో ప్లస్ మోడల్‌లో 6.78 అంగుళాల అమోలెడ్ ఈ6 డిస్‌ప్లే ఉంటుంది. 2K రిజల్యూషన్‌కు సపోర్టు చేస్తుంది.
Image:Vivo(నమూనా చిత్రం)
ఈ డిస్‌ప్లేకు 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1440 హెర్జ్ హైఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ ఇస్తున్నారు.
Image:Vivo(నమూనా చిత్రం)
వెనుకవైపు 50 ఎంపీ మెయిన్ కెమెరా ఉంటుంది. దీంతోపాటు 48 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్, 50 ఎంపీ పోర్‌ట్రైట్ లెన్స్, మరో పెరీస్కోప్ జూమ్ కెమెరా ఉంటాయి.
Image:Flipkart(నమూనా చిత్రం)
12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నెట్ స్టోరేజీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత ఆరిజన్ ఓఎస్ 3.0 ఉంటుంది. మన దేశంలో ఏ ఓఎస్‌తో వస్తుందో చూడాలి.
Image:Vivo(నమూనా చిత్రం)
4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది.
Image:Vivo(నమూనా చిత్రం)
స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్ ఇస్తున్నారు. అదే ఎక్స్ 90, ఎక్స్ 90 ప్రోలో అయితే.. డైమన్సిటీ 9200 ప్రాసెసర్ ఉంటుంది.
Image:Vivo(నమూనా చిత్రం)
ఈ మొబైల్స్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లో డిసెంబరులో విడుదల చేస్తారు. మన దేశంలోకి ఎప్పుడు తీసుకొస్తారనే విషయమై త్వరలో స్పష్టత రావొచ్చు.
Image:Vivo(నమూనా చిత్రం)