ఒకసారి ఆక్రోట్ తిని చూడండి..
డ్రైఫ్రూట్స్ అన్నింటిలోకెల్లా ఆక్రోట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
image: unsplash
దీనిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి. ప్రత్యేకంగా రొమ్ము క్యాన్సర్‌ని ఇవి నిరోధిస్తాయి. దీంట్లో ఉండే విటమిన్ బి కాంప్లెక్స్ గర్భిణుల్లో ఉమ్మనీరు పెంచేందుకు సహాయపడుతుంది.
image: rkc
ఆక్రోట్‌లో ఉండే మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ శరీరమంతటికీ రక్తం బాగా సరఫరా అయ్యేలా చేస్తాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
image: rkc
దీనిలో ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది. రోజూ గుప్పెడు తీసుకుంటే శరీరానికి సరిపడా ప్రోటీన్లు అందుతాయి. అలాగే బరువూ తగ్గొచ్చు.
image: rkc
మధుమేహం బారి నుంచి ఇది మనల్ని రక్షిస్తుంది. క్రమం తప్పకుండా ఆక్రోట్‌లను తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
image: rkc
పేగుల్లో మంచి బ్యాక్టీరియాని వృద్ధి చేయటంలో ఆక్రోట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. జీర్ణ, గ్యాస్ సంబంధిత సమస్యలను ఇది దూరం చేస్తుంది.
image: rkc
దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలున్నాయి. తరచూ దీన్ని తీసుకోవడంవల్ల ఆర్ర్థరైటిస్‌తో వచ్చే నొప్పులు, వాపులు క్రమంగా తగ్గుతాయి.
image: rkc
ఆక్రోట్ తినడం వల్ల మన చర్మానికి, శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ బయటకి పోతాయి. కళ్ల కింద వచ్చే నల్లటి వలయాలు తగ్గడంతో పాటు జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
image: rkc