బియ్యంలో పురుగులా? అయితే ఇలా చేయండి! 

బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే కొన్ని వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీయకుండా బియ్యం డబ్బాలో వెయ్యాలి లేదా వెల్లుల్లి రెబ్బలను పలుచటి కాటన్‌ వస్త్రంలో మూటకట్టి బియ్యం డబ్బాలో ఉంచాలి.

Image:Eenadu

వంటకాల్లో విరివిగా ఉపయోగించే ఇంగువ కూడా బియ్యంలో పురుగులు చేరకుండా కాపాడుతుంది. దీనికి కారణం ఇంగువ వెదజల్లే ఘాటైన వాసనే. దీన్ని కొద్దిగా తీసుకుని బియ్యంలో కలిపితే సరిపోతుంది.

Image:Eenadu 

బిర్యానీ ఆకులు కూడా బియ్యం పురుగులు పట్టకుండా చేస్తాయి.

Image:Pixabay

లవంగాలు లేదా లవంగాల పొడిని పలుచటి కాటన్‌ వస్త్రంలో మూటకట్టి బియ్యం మధ్యలో ఉంచాలి. బియ్యంలో రాళ్ల ఉప్పు కలిపి పెడితే పురుగు పట్టవు.

Image:Pixabay

కర్పూరం వెదజల్లే ఘాటైన సువాసన వల్ల బియ్యంలో పురుగులు పెరగవు. పది కర్పూరం బిళ్లలను తీసుకొని మెత్తని పొడిగా చేసుకొని మందంగా ఉండే నూలు వస్త్రంలో చుట్టి బియ్యం డబ్బాలో ఉంచాలి.

Image:Eenadu

వేపాకులు కూడా బియ్యంలో పురుగులు రాకుండా అడ్డుకుంటాయి. వేపాకుల పొడిని నూలు వస్త్రంలో చిన్న చిన్న మూటలుగా కట్టి బియ్యం మధ్యలో పెట్టాలి. ఇలా చేస్తే బియ్యంలో తెల్లపురుగులతో పాటు పెంకు పురుగులు కూడా చేరవు.

Image:Eenadu 

బియ్యంలో పురుగులు పెరగడానికి తేమ కూడా ఒక కారణమే. కాబట్టి బియ్యంలో తడి చేరకుండా చూసుకోవాలి. బోరిక్‌ పౌడర్‌ని బియ్యంలో కలిపితే దాంట్లో తేమని పీల్చేసుకుంటుంది.

Image:Pixabay

 బియ్యం నిల్వ చేసిన డబ్బాలో సిలికా జెల్‌ ప్యాకెట్లను పెడితే అవి తేమను పీల్చేసుకుంటాయి. ఫలితంగా బియ్యం పురుగులు పట్టకుండా కాపాడుకోవచ్చు.

Image:Pixabay

చిన్న పిల్లను బయటకు తీసుకురండి.. చాలు!

నవ్వితే ఎన్ని లాభాలో..

ష్‌.. మాట్లాడొద్దు ప్లీజ్‌!

Eenadu.net Home