పొగ తాగడం మానేయలేకపోతున్నారా? 

ఉదయం నిద్ర లేవగానే 2 గ్లాసుల వేడి నీళ్లలో నిమ్మరసం కలుపుకోని తాగాలి. నీళ్లలో తేనె కూడా వేసుకుని తాగొచ్చు.

image:Pixabay

సిగరెట్ తాగాలని ఎప్పుడు అనిపించినా ‘నేను సిగరెట్ తాగడం మానేయాలి’ అని మీలోమీరు అనుకోవాలి.

image:Pixabay 

 ఇలా చేసిన కూడా పొగ తాగాలని అనిపిస్తే... ప్రశాంతంగా కూర్చుని, దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. నీళ్లు తాగాలి. అలా చేయడం వల్ల మీ ఆలోచనను మళ్లించవచ్చు.

image:Pixabay

నారింజ, బత్తాయి, ద్రాక్ష పండ్లు తినడం, వాటి జ్యూస్ తాగడం వల్ల కూడా సిగరెట్ తాగాలనే కోరికను చంపేయవచ్చు.

image:Pixabay

సిగరెట్ తాగాలనిపించినప్పుడల్లా చూయింగ్ గమ్‌ నమలడం లేదా చాక్లెట్‌ తినండి.

image:Pixabay 

మీరు సిగరెట్ తాగడం మానేయాలని తీసుకున్న నిర్ణయాన్ని కుటుంబసభ్యులకు, స్నేహితులకు తెలియజేయాలి. ఇలా చేస్తే వారికి భయపడి పొగతాగడం మానేసే అవకాశం ఉంది.

image:Pixabay 

నికోటిన్‌కు ప్రత్యామ్నాయంగా ఉండే ఉత్పత్తులను తీసుకొని క్రమంగా పొగ తాగడం మానేయవచ్చు. ఏ సమయంలో సిగరెట్ తాగుతున్నారో చెక్ చేసుకొని ఆ సమయంలో వేరే పనిపై మనసు మళ్లించటం మంచిది.

image:Pixabay

మరొక ముఖ్యవిషయం.. ధుమపానం చేసే స్నేహితులకు దూరంగా ఉండండి.

image:Pixabay


బుల్లి దేశం తువాలు విశేషాలెన్నో..

గూగుల్‌ డూడుల్‌ గమనించారా..!

సెక్సువల్‌ అసాల్ట్‌ అవేర్‌నెస్‌ మంత్‌

Eenadu.net Home