ఆహార వృథాని ఇలా అరికట్టండి!

ఏటా టన్నుల కొద్దీ ఆహారం వృథా అవుతోంది. అలా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. మరి ఆహారం వృథా కాకుండా చేయాలంటే ఏం చేయాలి..?Image:RKC

నెలకోసారి పెద్దమొత్తంలో సరకులు కొనే బదులు వారానికోసారి వెళ్లి తెచ్చుకుంటే ఆహారం వృథా అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది.

Image:RKC

మార్కెట్‌కి వెళ్లే ముందు కావాల్సిన పదార్థాలను మాత్రమే జాబితాలో రాసుకొని వాటినే కొనండి. ఆఫర్లు ఉన్నాయని అతిగా కొని.. వృథా చేయొద్దు.

Image:RKC

సరిగా నిల్వ చేయకపోవడం వల్లే ఎక్కువశాతం ఆహారం వృథా అవుతుందట. ఆహార పదార్థాలను ఎక్కడ, ఎలా నిల్వ చేయాలో తెలుసుకోవాలి.

Image:RKC

ఇథిలీన్‌ గ్యాస్‌ను ఉత్పత్తి చేసే టమాటాలు, ఉల్లిగడ్డ, అరటి పండ్లు వంటివాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. వీటి వల్ల ఇతర పదార్థాలు పాడవ్వడమే కాదు.. విషతుల్యమయ్యే అవకాశముంది.

Image:RKC

ఎండబెట్టడం, పచ్చడి చేయడం, చల్లటి ప్రదేశంలో ఉంచడం వంటి నిల్వ చేసే పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి. ఏ పదార్థాన్ని ఎలా నిల్వ చేయాలో తెలుసుకుంటే వృథా అవదు.

Image:RKC 

వంటలో ఉప్పు ఎక్కువైందనో.. కారం తక్కువైందనో ఆహారం మొత్తాన్ని చెత్తపాలు చేయకూడదు. అలాంటి ఆహారాన్ని రుచికరంగా మార్చుకునేందుకు కొన్ని చిట్కాలుంటాయి. వాటిని పాటించండి.

Image:RKC

మీరు తినగా మిగిలిన ఆహారాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి మరుసటి రోజు తినొచ్చు. అయితే, ఎక్కువ కాలం ఫ్రిడ్జ్‌లో స్టోర్‌ చేసిన ఆహారం తినడం మంచిది కాదు.

Image:RKC

ఒకవేళ ఆహారం పాడయితే దాన్ని కంపోస్ట్‌లా చేసి మొక్కలకు ఎరువుగా ఉపయోగించే ప్రయత్నం చేయొచ్చు.

Image:RKC

శుభకార్యాల్లో వండిన వంటలు మిగిలిపోతే వాటిని చెత్తలో పడేయకుండా.. ఆకలితో అలమటిస్తోన్న నిరుపేదలకు పంచి పెట్టొచ్చు.

Image:RKC

మార్కెట్లో లభించే కొన్ని ఆహార పదార్థాలపై ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది. ఆ డేట్‌లోపే వాటిని కచ్చితంగా తినాలి. లేదంటే ఆహారం వృథా.. డబ్బులు వృథా.

Image:RKC

ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో రెస్టారెంట్స్‌కు వెళ్లినప్పుడు అవసరమైన మొత్తంలోనే ఆర్డర్‌ చేసుకోండి. షేర్‌ చేసుకొని తినడం వల్ల ఆహారం వృథా కాకుండా ఉంటుంది.

Image:RKC

అదనపు కేలరీలు కరిగిపోవాలంటే...!

సామెతలు ఎలా వచ్చాయో తెలుసా..?

ఆభరణాలంటే బంగారం.. వెండేనా? ఇంకా ఉన్నాయి

Eenadu.net Home