వీటిని సరిగానే స్టోర్‌ చేస్తున్నారా?

వెల్లుల్లి


వెల్లుల్లిని ఎక్కువ రోజులు బయట ఉంచడం వల్ల పాడవుతాయి. వాటిపై ఉండే పొట్టును తొలగించి ఎయిర్‌టైట్‌ కంటెయినర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే తాజాగా ఉంటాయి.

Image: Pixabay

గుడ్లు


రకరకాల ఉష్ణోగ్రతల వల్ల గుడ్డులోని కణజాలం దెబ్బతింటుంది. అందువల్ల గుడ్లను తెచ్చిన ట్రేలోనే బయట ఉంచడం మంచిది.

Image: Pixabay

డ్రైఫ్రూట్స్‌


డ్రైఫ్రూట్స్‌ను ఎక్కువ రోజులు నిల్వ చేయాలంటే ఎయిర్‌టైట్‌ కంటెయినర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.

Image: Pixabay

నిమ్మజాతి పండ్లు


నిమ్మ జాతి పండ్లు అయిన నిమ్మ, నారింజ, చీని పండ్లను గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వాటిల్లోని రసం తగ్గడంతో పాటు వాటి స్వభావాన్ని కోల్పోతాయి.

Image: Pixabay

ఆలివ్‌ ఆయిల్‌


ఆలివ్‌ ఆయిల్‌ను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. సూర్యుడి కాంతి తగలకుండా వంట గదిలో పెట్టుకోవచ్చు.

Image: Pixabay

గోధుమ పిండి


సాధారణంగా గోధుమ పిండిని ఎక్కువ మొత్తంలోనే కొనుగోలు చేస్తాం. మన వాడకాన్ని బట్టి కొంత మొత్తాన్ని బయట ఉంచి. మిగతా దాన్ని ఎయిర్‌టైట్‌ కంటెయినర్‌లో పెట్టాలి.

Image: Pixabay

బ్రెడ్‌


బ్రెడ్‌ ముక్కలను ఫ్రిజ్‌లో పెట్టకపోవడమే మంచిది. ఫ్రిజ్‌లో ఉంచితే అందులోని తేమ వల్ల బ్రెడ్‌ పాడయ్యే అవకాశముంది. అందుకే, వాటిని ఎయిర్‌టైట్‌ కంటెయినర్‌లో ఉంచి బయటే నిల్వ చేసుకోవచ్చు. 

Image: Pixabay

తేనె


తేనెను కూడా ఫ్రిజ్‌లో కాకుండా.. బయటే నిల్వ చేయాలి. గాజు సీసాలో పోసి గది ఉష్ణోగ్రత వద్ద తేనెను నిల్వ చేసుకోవచ్చు.

Image: Pixabay

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home